మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు అధికార బీజేపీకి చాలా ప్రతిష్టాత్మకం. మోదీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చి, సంచలన నిర్ణయాలు తీసుకు న్న తర్వాత జరిగిన ఎన్నికలు ఇవి. ఆ కీలక నిర్ణయాలు ప్రజామోదం ఉందో లేదో ఈ ఎలక్షన్స్‌లో తేలిపోనుంది. అలాగే, 2 రాష్ట్రాల్లో బీజేపీ చేసిన ప్రయోగం సఫలమైందో లేదో తెలుసుకునే అవకాశం కూడా ఎన్నికల ఫలితాలతో బయటప డనుంది. ఫడ్నవిస్, ఖట్టర్‌ల ఛరిష్మా ఏపాటిదో, ప్రజలు-పార్టీపై వారి ప్రభావం ఏ మేరకు ఉందో కూడా ఈ ఎన్నికలతోనే స్పష్టత రానుంది.

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల పాలకులతో పాటు కేంద్ర పాలకులకు కూడా చాలా విషయాల్లో క్లారిటీ రావడానికి ఈ ఎన్నికలు దోహదం చేయనున్నాయి. మరీ ముఖ్యంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, మనోహర్ లాల్ ఖట్టర్‌కు ఈ ఎలక్ష న్స్ తొలి పరీక్షగా నిలిచాయి. వారిద్దరి ఐదేళ్ల పాలనపై ప్రజా తీర్పు రాబోతోంది. మరి, ఈ ఐదేళ్లలో వారిద్దరు ప్రజలను ఎంతమేరకు మెప్పించారో ఈనెల 24న తేలిపోనుంది. 2014లో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు గానీ, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలు గానీ మోదీ చుట్టూనే తిరిగాయి. అటు ఫడ్నవిస్ గానీ, ఇటు ఖట్టర్ గానీ మెయిన్ ప్లేయర్లు కాదు. ఐతే, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఫడ్నవిస్, ఖట్టర్‌లే ప్రధాన ఆటగాళ్లు. మోదీ, అమిత్ షాలు వెనకుండి నడిపిం చేవాళ్లే. ప్రజల దృష్టి కూడా ఫడ్నవిస్, ఖట్టర్‌ల పనితీరుపైనే ఉంటుంది.

మహారాష్ట్ర, హర్యానా ప్రజలు ఏ పార్టీ వైపు?

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మరో ప్రధాన అంశం… ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ చేసిన ప్రయోగం. సాధారణంగా మహారాష్ట్రలో మరాఠా నాయకుల కు, హర్యానాలో జాట్ నేతలకు ఎక్కువ సార్లు సీఎం పగ్గాలు అందాయి. ఈ పోకడకు బీజేపీ నాయకత్వం చెక్ పెట్టింది. మహారాష్ట్రలో బ్రాహ్మణ వర్గానికి చెందిన ఫడ్నవిస్‌కు, హర్యానాలో జాటవేతర నాయకుడు ఖట్టర్‌కు పట్టం కట్టింది. ఐతే, ఫడ్నవిస్, ఖట్టర్‌ల పనితీరు మోస్తరు స్థాయిలోనే ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. మరి, ఈ యాంటీ సెంటిమెంట్‌ ప్రజల సెంటిమెంట్‌ను దెబ్బకొట్టిందా లేకా మోదీ-షాల చాణక్యానికి ప్రజలు దాసోహమన్నారా అనేది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తో తేలిపోనుంది. ఇక, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఓటేయడం మహారాష్ట్ర, హర్యానా ప్రజలకు అలవాటు. మరి, ఆ అలవాటు ఈసారి కూడా కొనసాగుతుందా లేదా చూడాలి.

ప్రతిపక్షాలు కోలుకుంటాయా?

లోక్‌సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. సార్వత్రిక ఎన్నికలు మొత్తం మోదీ ఉండాలా వద్దా అన్న అంశం చుట్టూనే తిరిగాయి. మోదీకి సరితూగే ప్రత్యర్థి లేకపోవడంతో బీజేపీ మరో 20కి పైగా సీట్లు ఎక్కువగా సాధించి వరుసగా రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. లోక్‌సభ ఎన్నిక లు జరిగి సుమారు 6 నెలలు అవుతోంది. ఈ నేపథ్యంలో తమ పార్టీపై ప్రజాభిమానం తగ్గిపోలేదని నిరూపించుకోవడం బీజేపీకి అత్యవసరం. అలాగే, లోక్‌సభ ఎన్నికల్లో తగిలిన దెబ్బ నుంచి ప్రతిపక్షాలు కోలుకోవడానికి కూడా రెండు రాష్ట్రాల ఎన్నికలు మహత్తర అవకాశం.

ఎన్డీయే -2 ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు

కేంద్రంలో రెండోసారి అధికారం సాధించిన తర్వాత మోదీ సర్కారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ట్రిపుల్ తలాఖ్‌ను రద్దు చేస్తూ చట్టం తీసుకువచ్చిన ఎన్డీ ఏ ప్రభుత్వం, కశ్మీర్ స్వయంప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్-370ని రద్దు చేసి పారేసింది. ఈ రెండు నిర్ణయాలపై ప్రతిపక్షాల నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరా లు వచ్చినప్పిటికీ ఎన్డీఏ సర్కారు పట్టించుకోలేదు. ఈ రెండు నిర్ణయాలపై ప్రజాభిప్రాయం ఏంటో తెలుసుకునే వీలు రెండు రాష్ట్రాల ఎన్నికలతో ఏర్పడింది. ఓ రకంగా ఈ ఎన్నికలు మోదీ సర్కారు నిర్ణయాలపై రెఫరెండమ్‌గా చెప్పుకోవచ్చు.

ఆర్ధిక మందగమంన ప్రభావం చూపుతుందా?

ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. పారిశ్రామికరంగం నేలచూపులు చూస్తోంది. జాతీయ-అంతర్జాతీయ సంస్థలు భారతదేశ రేటింగ్‌ను తగ్గిస్తు న్నాయి. దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరిగిపోతోంది. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో కీలకమైన మహారాష్ట్ర, హర్యానాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్థికమందగనం ఏమేరకు ప్రభావం చూపిందనేది ఆసక్తికరంగా మారింది. విచిత్రమేంటంటే, స్థానికంగా ఓ మేరకే లోకల్ అంశాలపై చర్చ జరిగిందని, ప్రచారం మొత్తం జాతీయ అంశాలు, జాతీయత-దేశభక్తి, మోదీ సర్కారు దూకుడు చుట్టూనే తిరిగింది. ఆర్థికమందగనం కంటే కూడా పాక్‌పై భారత పోరాటమే ఓటర్లను ఎక్కువగా అట్రాక్ట్ చేసింది. మొత్తానికి, రెండు రాష్ట్రాల ఎన్నికల్లో మోదీ ప్రభుత్వానికి పెద్దగా ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.