రేపే టెట్ ఫలితాలు..!
ఆంద్రప్రదేశ్ లో టెట్ ఫలితాలపై విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది.
By Kalasani Durgapraveen Published on 3 Nov 2024 2:04 PM ISTఆంద్రప్రదేశ్ లో టెట్ ఫలితాలపై విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. టెట్ ఫలితాలు ఈ నెల 4వ తేదీన ఐటీ శాఖ మంత్రి లోకేష్ టెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలిపింది. వాస్తవానికి ఈ టెట్ ఫలితాలు నవంబర్ 2న విడుదల కావాల్సి ఉంది. ఈ టెట్ పరీక్షకు 4,27,300 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోగా.. 3,68,661 మంది హాజరయ్యారు.
ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలే కల్పనగా పని చేస్తామని చెప్పిన కూటమి సర్కార్ ఈ దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కొరకు మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నికల సమయంలో టీడీపీ అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీ ప్రకారం ఇటీవల మెగా డీఎస్సీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను మాత్రం ఇంకా విడుదల చేయలేదు. ఈ పరీక్షకు నోటిఫికేషన్ ను విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మొత్తం 16,347 పోస్టులతో ఈ నెల 6న ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ప్రకటన విడుదల తేదీ నుంచి నెలరోజుల పాటు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.