Telangana: నేడే పాఠశాలల పునఃప్రారంభం.. మారిన టైమింగ్స్‌ ఇవే

వేసవి సెలవుల అనంతరం ఇవాళ్టి నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు బడి బాట పట్టనున్నారు.

By అంజి  Published on  12 Jun 2024 1:12 AM GMT
schools, Telangana, school timings

నేడే పాఠశాలల పునఃప్రారంభం.. మారిన టైమింగ్స్‌ ఇవే

వేసవి సెలవుల అనంతరం ఇవాళ్టి నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు బడి బాట పట్టనున్నారు. వారికి స్వాగతం పలికేందుకు పాఠశాలల కమిటీలు ఏర్పాటు చేశాయి. తొలి రోజే విద్యార్థులకు పాఠ్య, నోటు పుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేయనున్నాయి. సీఎం రేవంత్‌ కొన్ని స్కూళ్లు సందర్శించాల్సి ఉన్నప్పటికీ పలు కారణాలతో వాయిదా పడింది. కాగా ఈ విద్యా సంవత్సరం స్కూళ్ల టైమింగ్స్‌ మారాయి.

ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రాథమిక, ప్రాథమికోన్నత స్కూళ్లు ఉదయం 9 గంటలకే ప్రారంభం కానున్నాయి. ప్రాథమిక పాఠశాలలు సాయంత్రం 4 గంటల వరకు, ప్రాథమికోన్నత పాఠశాలలు సాయంత్రం 4.15 గంటల వరకు నిర్వహిస్తారు. హైస్కూళ్లు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభం అవుతాయి. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లో మాత్రం ఉదయం 8.45 నుంచి సాయంత్రం 3.45 వరకే స్కూళ్లు ఉంటాయి.

Next Story