TS SSC Hall Tickets : ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. 24 నుంచి హాల్‌టికెట్లు

తెలంగాణ రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థుల‌కు అల‌ర్ట్‌. మార్చి 24 నుంచి హ‌ల్‌టికెట్లు అందుబాటులో రానున్నాయి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 March 2023 8:15 AM IST
TS SSC Hall Tickets : ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. 24 నుంచి హాల్‌టికెట్లు

తెలంగాణ రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థుల‌కు అల‌ర్ట్‌. ఏప్రిల్ 3 నుంచి రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం కానుండ‌గా ఇందుకు సంబంధించిన హాల్‌టికెట్లు ఈ నెల 24 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండ‌నున్నాయి. ఈ విష‌యాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి తెలియ‌జేశారు. శ‌నివారం ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌, ఏర్పాట్ల పై అధికారుల‌తో మంత్రి స‌మావేశం అయ్యారు.

ప‌రీక్ష‌ల సంద‌ర్భంగా విద్యార్థుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ సారి 4,94,616 మంది విద్యార్థులు ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాస్తున్నార‌ని, వీరి కోసం 2,652 ప‌రీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసిన‌ట్లు మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి తెలిపారు. పరీక్షల నిర్వహణ పకడ్బదీంగా ఉండాలని, ప‌రీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

ఏప్రిల్ 3 నుంచి ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ఉదయం 09.30 గంటల నుంచి 12.30 గంటలకు వరకు ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. త్వరలో డీఈఓలు,ఆయా జిల్లాల కలెక్టర్లు,ఎస్పీలు, ఇతర సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫెరెన్సు ద్వారా ఏర్పాట్లపై సమీక్షించనున్నట్లు వివరించారు.

6 పేప‌ర్లే..

ఈ సారి 6 పేప‌ర్ల‌తో వంద శాతం సిల‌బ‌స్ తో ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. రాత పరీక్షలకు 80 మార్కులు, ఫార్మటివ్ అసెస్మెంట్ కు 20 మార్కులు ఉంటాయి. అన్ని ఎగ్జామ్స్ కు 3 గంటలు, సైన్స్ కు మాత్రం 3.20 గంటల సమయం ఉంటుంది.

ఏప్రిల్ 3 - ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్

ఏప్రిల్ 4 - సెకండ్ లాంగ్వేజ్

ఏప్రిల్ 6 - థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)

ఏప్రిల్ 8 - గణితం

ఏప్రిల్ 10 - సైన్స్

ఏప్రిల్ 11 - సోషల్ స్టడీస్

Next Story