స్కూల్ పిల్లలతో సీఎం రేవంత్ రెడ్డి పాటలకు డ్యాన్స్

కాంగ్రెస్ నేత, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పొగుడుతూ ఉన్న పాటకు తెలంగాణ పాఠశాల విద్యార్థినులు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

By Kalasani Durgapraveen  Published on  15 Dec 2024 5:30 PM IST
స్కూల్ పిల్లలతో సీఎం రేవంత్ రెడ్డి పాటలకు డ్యాన్స్

కాంగ్రెస్ నేత, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పొగుడుతూ ఉన్న పాటకు తెలంగాణ పాఠశాల విద్యార్థినులు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. జగిత్యాల లక్ష్మీపూర్‌లోని బీసీ సంక్షేమ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో శనివారం కామన్‌ డైట్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.కార్యక్రమంలో భాగంగా గురుకులంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

నలుగురు బాలికలు రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశంసిస్తూ “అన్న రేవంతు” పాటకు డ్యాన్స్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరయ్యారు. స్కూల్ పిల్లలతో రాజకీయ నాయకుల పాటలకు డ్యాన్స్ చేయిస్తారా అంటూ విమర్శలు వస్తున్నాయి.

Next Story