ఏప్రిల్‌ 20 నుండి ఇంటర్ పరీక్షలు.. పూర్తి షెడ్యూల్‌ ఇదే.!

Telangana Inter exams from April 20. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు (ఐపీఈ) 2022 ఏప్రిల్ 20 నుండి మే 10 వరకు నిర్వహించబడతాయి

By అంజి  Published on  8 Feb 2022 7:52 AM IST
ఏప్రిల్‌ 20 నుండి ఇంటర్ పరీక్షలు.. పూర్తి షెడ్యూల్‌ ఇదే.!

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు (ఐపీఈ) 2022 ఏప్రిల్ 20 నుండి మే 10 వరకు నిర్వహించబడతాయి. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సోమవారం జారీ చేసిన తాత్కాలిక ఐపీఈ షెడ్యూల్ ప్రకారం.. పరీక్షలు ఏప్రిల్ 20 న మొదటి సంవత్సరం విద్యార్థులకు రెండవ భాష పేపర్-1 తో, రెండవ సంవత్సరం పరీక్షలు రెండవ భాష పేపర్-2 తో ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 21 అన్ని థియరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి.

అదే విధంగా.. సాధారణ, వృత్తి విద్యా కోర్సులకు ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 23 నుండి ఏప్రిల్ 8 వరకు నిర్వహించబడతాయి. ఎథిక్స్ , హ్యూమన్ వాల్యూస్, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు వరుసగా ఏప్రిల్ 11 మరియు 12 తేదీలలో జరుగుతాయి. ఈ షెడ్యూల్ ఇంటర్మీడియట్ వృత్తి విద్యా కోర్సులకు కూడా వర్తిస్తుంది. అయితే, ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన టైమ్‌టేబుల్‌ను ప్రత్యేకంగా జారీ చేయనున్నట్లు బోర్డు తెలిపింది.

Next Story