అలర్ట్.. రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో 2025-26 అకడమిక్ ఇయర్ ప్రవేశాలకు సంబంధించి ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది.
By Knakam Karthik
అలర్ట్.. రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో 2025-26 అకడమిక్ ఇయర్ ప్రవేశాలకు సంబంధించి ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా విద్యార్థులకు మూడు విడతల్లో ప్రవేశం కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్టంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, JNTUH, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీల్లో బీఏ (BA), బీకాం (B.com), బీఎస్సీ (B.Sc.), బీబీఏ (BBA), తదితర సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం మూడు విడతల్లో ప్రవేశాలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
మొదటి ఫేజ్‌లో భాగంగా మే 3 నుంచి 21 వరకు మొదటి ఫేజ్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 10 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. మే 29న సీట్లను కేటాయించనున్నారు. ఇక రెండో ఫేజ్‌లో మే 30 నుంచి జూన్ 8 వరకు దరఖాస్తుల స్వీకరణ, మే 30 నుంచి జూన్ 9 వరకు వెబ్ ఆప్షన్లు, జూన్ 13న సీట్ల కేటాయింపు ఉంటుంది. అదే విధంగా మూడో ఫేజ్‌లో జూన్ 13 నుంచి 19 వరకు దరఖాస్తుల స్వీకరించి, జూన్ 13 నుంచి 19 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వనున్నారు. జూన్ 23న సీట్ల కేటాయించిన తరువాత జూన్ 30 నుంచి డిగ్రీ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యార్థులు ‘దోస్త్’ వెబ్‌సైట్, మొబైల్ యాప్, మీసేవ యాప్, మీసేవ కేంద్రాలకు వెళ్లి కళాశాల్లో ప్రవేశాలకు ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచించారు.