Telangana: 'దోస్త్‌' నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించే 'దోస్త్‌' (డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ) నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది.

By అంజి  Published on  3 May 2024 2:16 PM IST
telangana, dost 2024 notification, Education

Telangana: 'దోస్త్‌' నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించే 'దోస్త్‌' (డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ) నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. మొత్తం 3 విడతల్లో అడ్మిషన్లు కల్పించనున్నారు. రాష్ట్రంలోని ఉస్మానియా వర్శిటీ, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో దోస్త్ రిజిస్ట్రేషన్ల ఆధారంగా సీట్లను కేటాయించనున్నారు.

మే 6 నుంచి 25 మొదటి విడత రిజిస్ట్రేషన్‌ ఉంటుంది. రూ.200 రుసుంతో రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. మే 15 నుంచి 27 వరకు ‘దోస్త్‌’ వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. జూన్‌ 3న మొదటి దశ సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్‌ 4 నుంచి 10 లోపు సెల్ఫ్‌ రిపోర్టుకు అవకాశం కల్పించారు.

రెండో విడత రిజిస్ట్రేషన్లు జూన్ 4వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. 13వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ కు అవకాశం ఉంటుంది. రెండో విడత సీట్లను జూన్‌ 18వ తేదీన కేటాయిస్తారు. జూన్‌ 19 నుంచి 24వ తేదీలోపు సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది.

మూడో విడత జూన్ 19వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. జూన్‌ 25 వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. జూన్ 19 నుంచి 26 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాలి. జూన్‌ 29వ తేదీన తుది విడుత సీట్లను కేటాయిస్తారు. జూలై 3వ తేదీలోపు విద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. జులై 8వ తేదీ నుంచి డిగ్రీ కాలేజీల తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది డిగ్రీలో కొత్తగా బీకాం ఫైనాన్స్‌, బీఎస్సీ బయో మెడికల్‌ సైన్స్‌ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి.

Next Story