హైదరాబాద్: ఏప్రిల్ 25 నుంచి పాఠశాలలకు వేసవి సెలవుల షెడ్యూల్‌ను తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. మొత్తం 48 రోజుల వేసవి సెలవుల అనంతరం జూన్ 12, 2023న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 10న జరగాల్సిన పరీక్షలు ఇప్పుడు ఏప్రిల్ 12న ప్రారంభం కానుండగా.. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 13 వరకు జరగనున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని మార్చి రెండో వారం నుంచి హాఫ్‌డే పాఠశాలలు నడపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో వేసవి సెలవులు సాధారణంగా పాఠశాల అకడమిక్ క్యాలెండర్‌పై ఆధారపడి కొన్ని వారాల పాటు ఉంటాయి. కొన్ని పాఠశాలలకు ఎక్కువ వేసవి విరామం ఉండవచ్చు, మరికొన్ని పాఠశాలలకు తక్కువ విరామం ఉండవచ్చు. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలతో సహా అన్ని కేటగిరీల విద్యా సంస్థలను పూర్తి సంసిద్ధతతో తిరిగి తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యా శాఖను ఆదేశించింది. జూన్ 13 నుండి విద్యార్థులను శారీరకంగా తరగతులకు హాజరు కావడానికి అనుమతించాలని పేర్కొంది.