దేశ వ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులై విద్యార్థులకు 2025 - 26 విద్యా సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ అందిస్తోంది. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఆగస్టు 31 లోపు దరఖాస్తు చేసుకోగలరు. పరీక్ష ఫీజు రూ.100, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ విద్యార్థులకు రూ.50 (ఎస్బీఐ చలానా ద్వారా చెల్లించాలి). దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్, స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైతే నెలకు రూ.1000 చొప్పున తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు నాలుగేళ్ల పాటు అందిస్తారు. మొత్తం లక్షమందికి ఈ స్కాలర్‌షిప్ ఇస్తారు. ఏడో తరగతిలో 55 శాతం మార్కులు ఉండాలి. ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతూ ఉండాలి. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, రెసిడెన్షియల్ స్కూల్స్‌లో చదువుతున్న వారు అనర్హులు. విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3.50 లక్షలకు మించరాదు. https://scholarships.gov.in/లో వెబ్‌సైట్ పూర్తి వివరాలు ఉంటాయి.