హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ బ్యాక్‌లాగ్స్ ఉన్న వారికి గుడ్‌న్యూస్. వారికి అధికారులు వన్‌టైం ఛాన్స్ కింద మరోసారి పరీక్షలు రాసే అవకాశం కల్పించారు. ఈ మేరకు పరీక్షల విభాగం అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 2000 నుంచి 2015 మధ్య చదివి, ఫెయిలైన విద్యార్థులు తిరిగి పరీక్షలు రాయవచ్చని కంట్రోలర్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. విద్యార్థులు చదివిన కాలం చివరి ఏడాది సిలబస్ ప్రకారం పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు.
ఫీజు చెల్లించి జూలైలో జరిగే పరీక్షలకు హాజరుకావచ్చు. విద్యార్థులు జూన్ 19 వరకు ఫైన్ లేకుండా, రూ.500 ఫైన్‌తో జూన్ 25 వరకు ఫీజు చెల్లించవచ్చు. జులైలో పరీక్షలు జరుగుతాయి. ఆయా కళాశాలల నుంచి వచ్చే ఫీజులు కళాశాలల ద్వారా జూన్ 25 సాయంత్రం 5 గంటల వరకు ఓయూ పరీక్షల విభాగానికి ఆన్ లైన్ ద్వారా సమర్పించాలని కంట్రోలర్ కార్యాలయం స్పష్టం చేసింది. ఫీజు వివరాల కోసం www.osmania.ac.in లో చూడవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఫైయిల్ అయిన పూర్వ విద్యార్థులకు ఓయూ సూచించింది.