జూన్ 19 నుండి JoSAA/CSAB కౌన్సెలింగ్‌ను ప్రారంభించనున్న NIT రూర్కెలా

NIT Rourkela to begin JoSAA/CSAB counselling from June 19. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కెలా (NIT రూర్కెలా) 31 NITలు, IIESTలు, 26 IIITలు,

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Jun 2023 1:53 PM GMT
జూన్ 19 నుండి JoSAA/CSAB కౌన్సెలింగ్‌ను ప్రారంభించనున్న NIT రూర్కెలా

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కెలా (NIT రూర్కెలా) 31 NITలు, IIESTలు, 26 IIITలు, 3 SPAలు, 36 GFTIలలో వివిధ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ల కోసం 2023 సంవత్సరానికి కేంద్రీకృత సీట్ల కేటాయింపు ప్రక్రియను నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) రూర్కెలా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్స్ ద్వారా అనేక టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌లలో అడ్మిషన్ కోసం జూన్ 19న సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డ్ (CSAB) కోసం రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించనుంది. NIT రూర్కెలా డైరెక్టర్, CSAB 2023 చైర్మన్ ప్రొఫెసర్ కె ఉమామహేశ్వర్ రావు మాట్లాడుతూ, “JESAA/CSAB కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి JEE (మెయిన్) కటాఫ్ లేదు. అభ్యర్థులు ఆన్‌లైన్ ప్రక్రియకు సంబంధించిన దశలను జాగ్రత్తగా అనుసరించాలి. సహాయ కేంద్రాలు లేదా బహుభాషా హెల్ప్‌లైన్‌ల నుండి సహాయం తీసుకోవచ్చు." అని తెలిపారు.

అడ్మిషన్ ప్రక్రియలో 31 NITలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ (IIEST), 26 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIITలు), 3 స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (SPA), 36 GFTI (ప్రభుత్వ నిధులతో పనిచేసే సాంకేతిక సంస్థలు) భాగం కానున్నాయి. 40,000 సీట్లలో అడ్మిషన్ కోసం దాదాపు 2.5 నుండి 3 లక్షల మంది JEE మెయిన్ 2023 అర్హత పొందిన అభ్యర్థులు CSAB కౌన్సెలింగ్ కోసం నమోదు చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సంస్థ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, మరాఠీ, బంగ్లా, హిందీ, ఒడియా, ఆంగ్ల భాషలలో బహుభాషా హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసింది.

అభ్యర్థులు తప్పనిసరిగా 12వ తరగతిలో కనీసం 75 శాతం మార్కులను కలిగి ఉండాలి లేదా టాప్ 20 పర్సంటైల్‌లో ఉండాలి. SC, ST, PwD విద్యార్థులకు, 12వ తరగతిలో అర్హత మార్కులు 65% అని అధికారులు తెలిపారు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) అభ్యర్థులు జనరల్ కేటగిరీ కింద కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

అభ్యర్థులకు 40% కంటే తక్కువ అంగవైకల్యం కలిగి ఉండి, రాయడంలో ఇబ్బందులు ఉన్నవారైతే.. పరీక్షా సమయంలో స్క్రైబ్ లేదా అదనపు సమయం సేవలను పొందవచ్చు. అలాంటి అభ్యర్థులకు సంబంధించి ప్రత్యేకంగా ధృవీకరణ పత్రాలు తీసుకుని రావాల్సి ఉంటుంది. అధికారులతో ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.

JoSAA కౌన్సెలింగ్ సమయంలో క్యాటగిరీని మార్చుకున్న అభ్యర్థులు CSAB స్పెషల్ రౌండ్ రిజిస్ట్రేషన్ దశలో చెల్లుబాటు అయ్యే సర్టిఫికేట్‌ను అధికారులకు చూపించాలి. NIT రూర్కెలా ఆన్‌లైన్ ఇంటర్‌ఫేస్‌ను కూడా అభివృద్ధి చేసింది, ఇందులో అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే కేటగిరీ సర్టిఫికేట్‌ను అప్‌లోడ్ చేయడం ద్వారా వారి బర్త్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జాయింట్ సీట్ అలోకేషన్ సిస్టమ్ (జోసా) కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత NIT రూర్కెలా CSAB ప్రత్యేక రౌండ్‌ను ప్రారంభిస్తుంది. ఎంపిక చేసిన NITలలో కేంద్రపాలిత ప్రాంతాలకు సూపర్‌న్యూమరీ రౌండ్‌లు ఉన్నాయి. అలాగే AICTE- ఆమోదించిన సంస్థల్లో అటువంటి సౌకర్యాలు లేని రాష్ట్రాలు / UTలకు డిగ్రీ స్థాయి టెక్నికల్ కోర్సులలో సీట్ల రిజర్వేషన్ పథకం కింద సీట్లు కేటాయించడానికి జూన్ 26 నుండి NEUT రౌండ్లు నిర్వహిస్తారు.


Next Story