నీట్–పీజీ ప్రవేశపరీక్షకు కొత్త తేదీలు

పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్–పీజీ ప్రవేశపరీక్ష కొత్త తేదీలు వచ్చాయి.

By Medi Samrat  Published on  5 July 2024 2:45 PM GMT
నీట్–పీజీ ప్రవేశపరీక్షకు కొత్త తేదీలు

పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్–పీజీ ప్రవేశపరీక్ష కొత్త తేదీలు వచ్చాయి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని పీజీ కోర్సుల్లో చేరాలనుకొనే ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించేందుకు నీట్–పీజీ నిర్వహిస్తారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) నీట్ పీజీ పరీక్షకు కొత్త తేదీని ప్రకటించింది. పరీక్షను ఆగస్టు 11న నిర్వహించనున్నారు. రెండు షిఫ్టుల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. జూన్ 22నే నీట్–పీజీ పరీక్ష జరగాల్సి ఉండగా.. కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా ఎంట్రన్స్ ను వాయిదా వేసింది. ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్–యూజీ ఎంట్రన్స్ లో అక్రమాలు, పేపర్ లీకేజీలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన పరీక్షను వాయిదా వేయాలని కేంద్రం నిర్ణయించింది.

మే 5న నీట్–యూజీ ప్రవేశపరీక్ష నిర్వహించగా ఎన్ టీఏ చరిత్రలోనే తొలిసారిగా పరీక్ష ఫలితాల్లో ఏకంగా 67 మంది విద్యార్థులు 720కిగాను 720 స్కోర్ సాధించారు. అభ్యర్థులు తాజా అప్‌డేట్‌ల కోసం natboard.edu.inని సందర్శించాలని సూచించారు.

Next Story