ప్రైవేటు ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్ కాలేజీలు ఇష్టానుసారం వసూలు చేస్తున్న ఫీజులపై తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (TAFRC) దృష్టి సారించింది. తాము నిర్ణయించిన ఫీజులు మాత్రమే కాలేజీలు తీసుకోవాలని సూచించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ JNTUH యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లతో TAFRC ఛైర్మన్ సమావేశమయ్యారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యా మండలికి TAFRC సూచించింది. ఇప్పటికే అన్ని కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చిందని.. బీ కేటగిరి సీట్ల సంబంధించి TAFRCకి ఫిర్యాదు చేసిన విద్యార్థుల దరఖాస్తులు ఆయా కాలేజీలు స్వీకరించడం లేదని పేర్కొంది. వెంటనే విద్యార్థుల నుంచి బీ కేటగిరీ సీట్ల కోసం దరఖాస్తులు తీసుకోవాలని.. లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏఎఫ్ఆర్‌సీ నిర్ణయించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేయరాదని సూచించింది. అదనంగా వసూలు చేసినట్లు తేలితే రూ.2 లక్షల ఫైన్ విధిస్తామని హెచ్చరించింది. ఎంతమంది దగ్గర వసూలు చేస్తే అన్ని రెండు లక్షలు కాలేజీలు కట్టాలని సూచించింది.