జేఈఈ మెయిన్స్ సెష‌న్ 1 ఫ‌లితాలు విడుద‌ల‌.. ఇలా చెక్ చేసుకొండి

JEE Mains 2023 session 1 results out.జేఈఈ మెయిన్స్ 2023 ప‌రీక్షా ఫ‌లితాలు వ‌చ్చేశాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Feb 2023 10:27 AM IST
జేఈఈ మెయిన్స్ సెష‌న్ 1 ఫ‌లితాలు విడుద‌ల‌.. ఇలా చెక్ చేసుకొండి

విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్స్ 2023 ప‌రీక్షా ఫ‌లితాలు వ‌చ్చేశాయి. ఈ ఏడాది జ‌న‌వ‌రి 24 నుంచి ఫిబ్ర‌వ‌రి 1 మ‌ధ్య జ‌రిగిన తొలి విడుత ప‌రీక్ష ఫ‌లితాల‌ను నేషనల్ టెస్ట్ ఏజెన్సీ (ఎన్‍టీఏ )విడుద‌ల చేసింది.ఎన్‍ఐటీలు, ఐఐటీలు, సీఎఫ్‍టీల్లో ప్రవేశాల కోసం ఈ ఎగ్జామ్‍ను ఎన్‍టీఏ నిర్వహిస్తుంటుంది. పేపర్-1 (బీటెక్‌/ బీఈ) పరీక్షకు 8.6 లక్షల మంది, పేపర్-2 (బీ.ఆర్క్‌/ బి.ప్లానింగ్‌) కు 46వేల మంది రిజిస్టర్ చేసుకోగా.. 95.79శాతం మంది అభ్యర్థులు పరీక్షలకు హాజ‌రు అయ్యారు. ఫ‌లితాల కోసం అభ్యర్థులు ఎన్‍టీఏ అధికారిక వెబ్‍సైట్ jeemain.nta.nic.in ను సంద‌ర్శించొచ్చు.

జేఈఈ మెయిన్స్ సెషన్-1 ఫలితాలను చెక్ చేసుకోండిలా

- ముందుగా బ్రౌజర్‌లో jeemain.nta.nic.in వెబ్‍సైట్‍లోకి వెళ్లాలి.

- హోమ్ పేజీలోనే జేఈఈ మెయిన్స్ 2023 రిజల్ట్స్ లింక్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.

- అనంతం మీ అప్లికేషన్ నంబర్ సహా అక్కడ అడిగిన వివ‌రాల‌ను ఎంటర్ చేయాలి.

- ఆ తర్వాత సబ్మిట్ బటన్‍పై క్లిక్ చేస్తే మీ రిజల్ట్స్ వ‌స్తుంది.

- ఆ త‌రువాత రిజల్ట్స్ స్కోర్ కార్డును డౌన్‍లోడ్ చేసుకోవచ్చు.

జేఈఈ మెయిన్స్ రెండో విడుత ప‌రీక్ష‌లు ఏప్రిల్ 6 నుంచి 12 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు అయ్యేందుకు రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ నేటి(మంగ‌ళ‌వారం) నుంచి ప్రారంభం కానుంది. తొలి విడుత రాసిన విద్యార్థులు సైతం రెండో విడుత‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ ప‌రీక్ష పూర్తి అయిన త‌రువాత ఆల్ ఇండియా ర్యాంకుల‌ను ఎన్‌టీఏ ప్ర‌క‌టిస్తుంది. వీరిలో టాప్ 2.2ల‌క్ష‌ల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష రాసేందుకు అవ‌కాశం ఉంటుంది. ఆ త‌రువాత దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఎన్ఐటీలు, ఇత‌ర ప్ర‌భుత్వ నిధుల‌తో న‌డిచే సాంకేతిక విద్యా సంస్థ‌ల్లో అడ్మిష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభం అవుతుంది.

Next Story