జేఈఈ అడ్వాన్స్‌డ్ షెడ్యూల్ విడుదల
మే 18, 2025న నిర్వహించనున్న జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) అడ్వాన్స్‌డ్ షెడ్యూల్ ను విడుదల చేశారు.
By Medi Samrat Published on 22 Dec 2024 2:30 PM GMTమే 18, 2025న నిర్వహించనున్న జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) అడ్వాన్స్‌డ్ షెడ్యూల్ ను విడుదల చేశారు. సంబంధిత వెబ్‌సైట్ https://jeeadv.ac.in/లో షెడ్యూల్ ను చూసుకోవచ్చు. JEE మెయిన్స్ 2025 పేపర్‌లో మొదటి 2.5 లక్షల ర్యాంక్‌ను పొందిన అభ్యర్థులు – I కోసం BE/BTech పరీక్షకు అర్హులు.
తెలంగాణలో జేఈఈ అడ్వాన్స్ పరీక్ష రాసేందుకు 13 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ ఉన్నాయి. ఆర్గనైజింగ్ ఇన్‌స్టిట్యూట్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కాన్పూర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఏప్రిల్ 23 నుండి మే 2 వరకు ప్రారంభించనుంది. అర్హులైన అభ్యర్థులు పరీక్ష ఫీజును మే 5 సాయంత్రం 5 గంటలలోపు చెల్లించాలి. మహిళలు, షెడ్యూల్డ్ కులం (SC), షెడ్యూల్డ్ తెగ (ST), వికలాంగులు (PwD) అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 1600. ఇతర అభ్యర్థులకు రూ. 3200.
ఐఐటీల్లో ప్రవేశానికి రెండు సెషన్లలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పేపర్ 1 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహిస్తారు. అర్హత గల అభ్యర్థులు మే 11 నుండి మే 18 వరకు ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 2:30 గంటల మధ్య అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పరీక్ష రాయడానికి వయస్సు ప్రమాణాలను చూస్తే అక్టోబర్ 1, 2000న లేదా ఆ తర్వాత జన్మించిన అభ్యర్థులు అయి ఉండాలి. అయితే, SC, ST, PwD కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.