తెలంగాణలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్యను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఈఏపీసెట్ వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభం నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఈ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఎన్ని ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి? వాటిలో భర్తీ చేసే సీట్ల వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తంగా 171 ఇంజినీరింగ్ కళాశాలల్లో 1,07,218 సీట్లు భర్తీ చేయనున్నట్లు తెలిపింది.
వీటిలో కన్వీనర్ కోటా (70శాతం) కింద 76,795 సీట్లు భర్తీ చేస్తున్నట్లు స్పష్టం చేస్తూ ప్రత్యేక జాబితాను విడుదల చేసింది. మరోవైపు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు జులై 8 ఆఖరి గడువు అని వెల్లడించింది. అడ్మిషన్ల కోసం 95,654మంది ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకున్నారని. 76,494మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారని సాంకేతిక విద్యా కమిషనర్, టీజీఈఏపీసెట్ కన్వీనర్ శ్రీదేవసేన ఓ ప్రకటనలో తెలిపారు.