నీట్ పీజీ పరీక్ష 2022 వాయిదా
Health Ministry postpones NEET PG exam by 6 to 8 weeks. ఈ సంవత్సరం నిర్వహించే నీట్ పీజీ పరీక్ష కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవలి ఆర్డర్‌లో నీట్ పీజీ
By అంజి Published on 4 Feb 2022 11:49 AM ISTఈ సంవత్సరం నిర్వహించే నీట్ పీజీ పరీక్ష కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవలి ఆర్డర్‌లో నీట్ పీజీ 2022 పరీక్షలను 6 నుండి 8 వారాలకు వాయిదా వేసింది. ఇంతకుముందు పరీక్షను మార్చి 12, 2022 న నిర్వహించాలని నిర్ణయించారు. "ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నీట్ పీజీ 2022ని 6-8 వారాలు లేదా అంతకంటే ఎక్కువ వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది" అని ఆర్డర్ పేర్కొంది. 2022 నీట్ పీజీ పరీక్షలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితులను చూసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఇది నీట్ పీజీ 2021 కౌన్సెలింగ్‌తో విభేదిస్తోంది. ఎందుకంటే.. అదే సమయంలో నీట్ పీజీ కౌన్సిలింగ్ జరగనుంది. పరీక్ష వాయిదాకు సంబంధించిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది. జనవరి 25న ఈ పిటిషన్ దాఖలు చేయబడింది. నివేదికల ప్రకారం, తప్పనిసరి ఇంటర్న్‌షిప్ మొదలైన అనేక అవసరాలు చాలా మంది అభ్యర్థులు నెరవేర్చకపోవడంతో 6 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తమిళనాడు అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్ బిల్లు (నీట్ వ్యతిరేక బిల్లు) గ్రామీణ మరియు ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యాల విద్యార్థుల ప్రయోజనాలకు విరుద్ధమని తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి అసెంబ్లీ స్పీకర్ ఎం.అప్పావుకు తిరిగి పంపడంతో, #GetOutRavi శుక్రవారం ట్విట్టర్‌లో ట్రెండింగ్ అయ్యింది. నీట్ వ్యతిరేక బిల్లును గవర్నర్ వాపస్ చేయడంపై అధికార, ప్రతిపక్ష పార్టీల రాజకీయ నాయకులు విమర్శలు గుప్పించారు. నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. నీట్‌పై తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎంకే స్టాలిన్ ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌లో తమిళనాడు అసెంబ్లీలో నీట్ వ్యతిరేక బిల్లును తీసుకొచ్చింది. 12వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా మెడిసిన్, డెంటిస్ట్రీ, హోమియోపతి మరియు ఇలాంటి కోర్సుల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి బిల్లు అందిస్తుంది.