ఎంసెట్‌-2020లో ర్యాంకులు సాధించిన బైపీసీ విద్యార్ధుల‌కు గుడ్‌న్యూస్‌

Good News To EAMCET-2020 Students. ఎంసెట్‌-2020లో ర్యాంకులు సాధించిన బైపీసీ విద్యార్ధుల‌కు గుడ్‌న్యూస్‌. వ్యవసాయ, ఉద్యాన

By Medi Samrat
Published on : 23 Nov 2020 7:22 AM IST

ఎంసెట్‌-2020లో ర్యాంకులు సాధించిన బైపీసీ విద్యార్ధుల‌కు గుడ్‌న్యూస్‌

ఎంసెట్‌-2020లో ర్యాంకులు సాధించిన బైపీసీ విద్యార్ధుల‌కు గుడ్‌న్యూస్‌. వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ, అనుబంధ ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశానికి రైతుకోటా కింద ఆన్‌లైన్‌ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ర్టార్‌ నున్నా త్రిమూర్తులు కోరారు.

ఆన్‌లైన్‌ ఉమ్మడి ప్రవేశాల దరఖాస్తు పత్రాలు, సమర్పించాల్సిన ఇతర పత్రాల వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏఎన్‌జీఆర్‌ఏయూ.ఏసీ.ఐఎన్‌)ను చూడాలని సూచించారు. సోమవారం నుంచి డిసెంబరు 2వ తేదీ(10రోజులు)లోగా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సంబంధిత పత్రాలు అప్‌లోడ్‌ చేయాలన్నారు.


Next Story