గురుకులాల్లో అడ్మీషన్లకు దరఖాస్తు గడువు పెంపు

ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును 31-03-2024 నుండి 05-04-2024 వరకు పొడగించినట్లు

By Medi Samrat  Published on  2 April 2024 4:15 PM IST
గురుకులాల్లో అడ్మీషన్లకు దరఖాస్తు గడువు పెంపు

ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును 31-03-2024 నుండి 05-04-2024 వరకు పొడగించినట్లు ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్. నరసింహారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

2024-25 విద్యా సంవత్సరంలో 5,6,7, 8 తరగతులలో మిగిలిపోయిన సీట్లు(బ్యాక్ లాగ్ సీట్లు), ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్ధేశించిన APRS CET-2024, APRJC&DC CET-2024 లకు దరఖాస్తు గడువును ఈ నెల 5వ తేదీ వరకు పొడగించినట్లు ఆయన పేర్కోన్నారు. అర్హత గల అభ్యర్థులు ఏప్రియల్ 5 లోపు https://aprs.apcfss.in వెబ్ సైట్ లో దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపించాలని నరసింహారావు కోరారు.

Next Story