సీ-టెట్‌ పరీక్షలు వాయిదా

CTET 2021 exam postponed.సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(సీ-టెట్‌) ప‌రీక్ష‌ గురువారం దేశ వ్యాప్తంగా ప్రారంభ‌మైంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Dec 2021 12:52 PM IST
సీ-టెట్‌ పరీక్షలు వాయిదా

సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(సీ-టెట్‌) ప‌రీక్ష‌ గురువారం దేశ వ్యాప్తంగా ప్రారంభ‌మైంది. ఆన్‌లైన్‌లో ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తుండ‌గా.. సాంకేతిక స‌మ‌స్య త‌లెత్తింది. దీంతో ఈ ప‌రీక్ష‌ను వాయిదా వేస్తున్న‌ట్లు సీబీఎస్ఈ ప్ర‌క‌టించింది. తొలిసారి ఈ ప‌రీక్ష‌ను ఆన్‌లైన్‌లో నిర్వ‌హించారు. గురువారం కొందరు విద్యార్ధులు సీ-టెట్‌-2021 మొదటి పేపర్ ను సాంకేతిక కారణాలతో రాయలేకపోయారు. సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు స‌మ‌స్య ప‌రిష్కారం కాక‌పోవ‌డంతో.. రెండో పేపర్ ను కూడా రద్దు చేయాల్సి వచ్చిందని సీబీఎస్ఈ ప్ర‌కటించింది.

డిసెంబర్ 16, 17 తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షల తేదీలను తర్వాత ప్రకటించనున్నట్లు తెలిపింది. వాయిదా వేసిన ప‌రీక్ష‌ల‌ను తిరిగి ఎప్పుడు నిర్వహించేది అభ్యర్థులకు త్వరలోనే సమాచారం ఇవ్వనున్నారు. అయితే.. డిసెంబర్‌ 20 నుంచి జరిగే పరీక్షలను యథావిధిగా నిర్వహించనున్నారు. దేశంలో వివిధ నగరాల్లో నిర్వహించే ఈ పరీక్షలు జనవరి 13 వరకు జరగనున్నాయి.

కాగా.. కేంద్రీయ విద్యాలయం, సైనిక్‌ స్కూల్స్‌, నవోదయ స్కూల్స్‌ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలలో విద్యాబోధనకు సీ-టెట్‌ను ప్రామాణికంగా భావిస్తారు. దేశ వ్యాప్తంగా ఈ పరీక్షల కోసంప్రతి ఏడాది ఎంతోమంది ఎదురు చూస్తుంటారు.

Next Story