ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు టెన్త్ క్లాస్ ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ వెల్లడించింది. లాంగ్వేజెస్, మ్యాథ్స్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పేపర్లకు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 వరకు జరుగుతాయి.
తెలంగాణలో మార్చి 6వ తేదీ నుంచి 15 వరకు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల నుంచి 3.15 నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులకు మధ్యాహ్నం 12.15 గంటలకు ముందే భోజనం అందించాలని ఆయా పాఠశాలలను విద్యాశాఖ ఆదేశించింది.
ఏపీలో టెన్త్ ఫైనల్ పరీక్షలు మార్చి 17 నుంచి 31 వరకు జరగనున్నాయి. అలాగే ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచి 19 వరకు ఫస్టియర్, మార్చి 3 నుంచి 20 వరకు సెకండీయర్ పరీక్షలు జరగనున్నాయి.
తెలంగాణలో టెన్త్ ఫైనల్ పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయి. అలాగే ఇంటర్ పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి 24 వరకు ఫస్టియర్, మార్చి 6 నుంచి 25 వరకు సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి.