పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇకపై 6 పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఎస్‌ఈ సిలబస్ నేపథ్యంలో 6 పేపర్ల విధానం అమలు చేయనున్నారు. 2022-23 విద్యా సంవత్సరం నుండి అమలు చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది.
టెన్త్ పరీక్షల్లో తీసుకుని వచ్చిన కీలక సంస్కరణలు ఇవే :
ఇకపై పబ్లిక్ పరీక్షల్లో ఆరు పరీక్షలు మాత్రమే నిర్వహణ
గతంలో 11 పేపర్లు,కోవిడ్ కారణంగా 7 పేపర్లకు కుదించిన సర్కార్
తాజాగా ఆరు సబ్జెక్టులకు ఆరు పేపర్లు మాత్రమే నిర్వహణ
ఫిజికల్ సైన్స్,బయలాజికల్ సైన్స్ కు కలిపి ఒకే పేపర్
సీబీఎస్ఈ తరహాలో పరీక్షలు నిర్వహించేలా ఉత్తర్వులు