సీబీఎస్సీ టెన్త్, ఇంటర్ తరగతుల బోర్డ్ ఎగ్జామ్ షెడ్యూల్ ఖరారైంది. పదవ తరగతి పరీక్షలు 2026 ఫిబ్రవరి 17-మార్చి 18 వరకు. 12వ తరగతి ఎగ్జామ్స్ ఫిబ్రవరి 17న ప్రారంభమై ఏప్రిల్ 4న ముగుస్తాయని బోర్డ్ ప్రకటించింది. ఈసారి 10,12 తరగతుల పరీక్షలకు దాదాపు 45 లక్షల మంది హాజరవుతారని పేర్కొంది. చాలా వరకు పేపర్లు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు జరుగుతాయని బోర్డు తెలిపింది. ఈ తేదీలు తాత్కాలికమేనని, సవరణకు లోబడి ఉంటాయని CBSE స్పష్టం చేసింది. పునఃపరీక్షలు అవసరమయ్యే విద్యార్థులకు మరో విండోను అందించడానికి బోర్డు 10వ తరగతి సప్లిమెంటరీ లేదా పరీక్ష-2ను మే 15, 2026 నుండి ప్లాన్ చేసింది. పూర్తి వివరాలకు www.cbse.giv.in చూడొచ్చు.