ఉద్యోగ అభ్యర్థులకు తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ తీపిక కబురు చెప్పింది. స్టడీ సర్కిళ్లలో ఆగస్టు 25 నుంచి 150 రోజుల పాటు గ్రూప్స్ ఎగ్జామ్స్, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌టీ, బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్ పరీక్షల కోసం ఉచితంగా ట్రెయినింగ్ ఇవ్వనుంది. అర్హులైన అభ్యర్థులు "www.tgbcstudycircle.cgg.gov.in" ద్వారా 16.07.2025 నుంచి 11.08.2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ నెం: 040- 24071178 ను సంప్రదించవచ్చు.
అర్హతలు - ఎంపిక విధానం
తల్లిదండ్రుల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000గా ఉండాలి.
పట్టణ ప్రాంతాల్లో తల్లిదండ్రుల ఆదాయం రూ.2,00,000 మించకూడదు.
డిగ్రీ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. రిజర్వేషన్లను కూడా ప్రామాణికంగా తీసుకుంటారు.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1000 చొప్పున స్టైఫండ్