ఈ నెల 24వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని స్కూళ్లకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఈ మేరకు సెలవులు ఇవ్వనున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఫైనల్ పరీక్షలపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒకటి నుంచి 9 వ తరగతి విద్యార్థులకు ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వార్షిక పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. రెండు రోజుల్లో మూల్యాంకనం పూర్తి చేసి ఏప్రిల్ 23న ఫలితాలను ప్రకటించి విద్యార్థులకు ప్రోగెస్ కార్డులు అందించాలని విద్యాశాఖ తన ఆదేశాల్లో పేర్కొంది.
మరో వైపు జూన్ 11 వరకు సెలవులు ఉండనున్నాయి. ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న వేసవి సెలవుల కోసం ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలను మూసివేయనున్నట్లు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. జూన్ 11 వరకు వేసవి సెలవులు కొనసాగుతాయని పాఠశాలల శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే విద్యా సంవత్సరానికి పాఠశాలలు జూన్ 12న పునఃప్రారంభమవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.