నేడు టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌

Andhra Pradesh 10th result today. ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి ఫలితాలను విద్యాశాఖ‌ ఈరోజు

By Medi Samrat  Published on  6 Jun 2022 8:13 AM IST
నేడు టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌

ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి ఫలితాలను విద్యాశాఖ‌ ఈరోజు(సోమ‌వారం) విడుదల చేయ‌నుంది. ఫలితాలు బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://www.bse.ap.gov.in/లో విడుదల చేయబడతాయి. మధ్యాహ్నం ప‌న్నెండు గంట‌ల త‌ర్వాత‌ ఫలితాలు విడుదలవుతాయని భావిస్తున్నారు. అంతకుముందు, ఫలితాలను జూన్ 4, 2022న ప్రకటించాల్సి ఉంది, కానీ చివరి క్షణంలో బోర్డు దానిని సోమవారానికి అంటే నేటికి వాయిదా వేసింది. ఏప్రిల్ 27 నుండి మే 9, 2022 వరకు ఏపీ ఎస్ఎస్సీ బోర్డు ప‌రీక్ష‌ల‌ను నిర్వహించింది. పరీక్షను నిర్వహించిన తర్వాత 27 రోజుల రికార్డు సమయంలో ఫ‌లితాలు ప్రకటించబడుతున్నాయి.







Next Story