ఏపీ, తెలంగాణలోని టెన్త్, ఇంటర్ విద్యార్థులకు అలర్ట్
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించడానికి ఈ నెల 18వ తేదీ వరకు ప్రభుత్వ పరీక్షల విభాగం గడువు ఇచ్చింది.
By అంజి
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించడానికి ఈ నెల 18వ తేదీ వరకు ప్రభుత్వ పరీక్షల విభాగం గడువు ఇచ్చింది. రూ.50 ఫైన్‌తో డిసెంబర్ 2 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 12 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 21 వరకు చెల్లించవచ్చని పేర్కొంది. ఇంటర్ పరీక్ష ఫీజును నవంబర్ 26 వరకు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది.
రూ.100 ఫైన్‌తో నవంబర్ 27 నుంచి డిసెంబర్ 4 వరకు, రూ.500 ఫైన్‌తో డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 11 వరకు, రూ.1000 ఫైన్‌తో డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 18 వరకు, రూ.2000 ఫైన్‌తో డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 27 వరకు చెల్లించవచ్చంది. ఇంటర్ (జనరల్) రెగ్యులర్ విద్యార్థులకు ఫీజు రూ.520, ఒకేషనల్ విద్యార్థులు రూ.750 చెల్లించాల్సి ఉంటుంది.
ఇక ఏపీలో ఇంటర్ విద్యార్థులకు పరీక్ష ఫీజు గడువును పొడిగించారు. ఎలాంటి ఫైన్ లేకుండా నవంబర్ 21 వరకు చెల్లించవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. రూ.1000 ఫైన్‌తో డిసెంబర్ 5 వరకు చెల్లించవచ్చని పేర్కొంది. అదేవిధంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. ఈ నెల 18 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా చెల్లించవచ్చని ఎస్‌ఎస్‌సీ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి తెలిపారు. రూ.50 ఫైన్‌తో ఈ నెల 25 వరకు, రూ.200 షైన్తో డిసెంబర్ 3వ తేదీ వరకు అవకాశం కల్పించారు.