Telangana: అక్టోబర్‌ 3 నుంచి ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ ఎగ్జామ్స్‌

తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ (టాస్‌) ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది.

By అంజి  Published on  26 Sept 2024 6:31 AM IST
Telangana, students, open Tenth, open Inter exams,

Telangana: అక్టోబర్‌ 3 నుంచి ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ ఎగ్జామ్స్‌

తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ (టాస్‌) ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. అక్టోబర్‌ 3 నుంచి 9 వరకు పరీక్షలు నిర్వహించనుంది. మార్నింగ్‌ సెషన్‌ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆఫ్టర్‌ నూన్‌ సెషన్‌ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనుంది.

టెన్త్‌ పరీక్షలకు సంబంధించి అక్టోబర్‌ 3న ఉదయం తెలుగు, మధ్యాహ్నం సైకాలజీ, అక్టోబర్‌ 4న ఉదయం ఇంగ్లీష్‌, మధ్యాహ్నం ఇండియన్‌ కల్చర్‌ అండ్‌ హెరిటేజ్‌, అక్టోబర్‌ 5న ఉదయం మ్యాథ్స్‌, మధ్యాహ్నం బిజినెస్ స్టడీస్‌, అక్టోబర్‌ 6న ఉదయం సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, మధ్యాహ్నం హిందీ, అక్టోబర్‌ 7న ఉదయం సోషల్‌ స్టడీస్‌, మధ్యాహ్నం ఉర్దూ, అక్టోబర్‌ 8న ఉదయం ఎకనామిక్స్‌, మధ్యాహ్నం హోంసైన్స్‌, అక్టోబర్‌ 9న ఉదయం వొకేషనల్‌ సబ్జెక్ట్స్ థియరీ, మధ్యాహ్నం వొకేషనల్‌ పీఎస్‌టీటీ ప్రాక్టికల్‌ నిర్వహిస్తారు.

ఓపెన్‌ ఇంటర్‌ ఎగ్జామ్స్‌కు సంబంధించి అక్టోబర్‌ 3న మార్నింగ్ తెలుగు, ఉర్దూ, హిందీ, మధ్యాహ్నం అరబిక్‌, అక్టోబర్‌ 4న మార్నింగ్‌ ఇంగ్లీష్‌, మధ్యాహ్నం సోషియాలజీ, అక్టోబర్‌ 5న ఉదయం పొలిటికల్‌ సైన్స్‌, మధ్యాహ్నం కెమిస్ట్రీ, పెయింటింగ్‌, అక్టోబర్‌ 6న మార్నింగ్‌ కామర్స్‌/బిజినెస్ స్టడీస్‌, మధ్యాహ్నం ఫిజిక్స్‌, సైకాలజీ, అక్టోబర్‌ 7న మార్నింగ్‌ హిస్టరీ, మధ్యాహ్నం మ్యాథ్స్‌, జియోగ్రఫీ, అక్టోబర్‌ 8న మార్నింగ్‌ ఎకనామిక్స్‌, మాస్‌ కమ్యూనికేషన్‌, మధ్యాహ్నం బయాలజీ, అకౌంటెన్సీ, హోంసైన్స్‌, అక్టోబర్‌ 9న మార్నింగ్‌ వొకేషనల్‌ సబ్జెక్ట్స్‌ థియరీ నిర్వహించనున్నారు. ప్రాక్టికల్‌ ఎగ్జామ్స్‌ అక్టోబర్‌ 16 నుంచి అక్టోబర్‌ 23 వరకు నిర్వహిస్తారు.

Next Story