AP: విద్యార్థులకు అలర్ట్.. ఇంటర్ హాల్ టికెట్లు విడుదల
ఏపీ: ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. విద్యార్థులు కాలేజీల నుంచి తీసుకోవచ్చు.
By అంజి Published on 22 Feb 2024 7:05 AM ISTAP: విద్యార్థులకు అలర్ట్.. ఇంటర్ హాల్ టికెట్లు విడుదల
ఏపీ: ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. విద్యార్థులు కాలేజీల నుంచి తీసుకోవచ్చని, లేదంటే https://bieap.apcfss.in/ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. మార్చి 1 నుంచి 19 వరకు ఫస్టియర్, మార్చి 2 నుంచి 20 వరకు సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. 10,52,221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1559 సెంటర్లను సిద్ధం చేసింది. పరీక్ష గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1559 సెంటర్లను సిద్ధం చేసింది. పరీక్ష గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ఎలా?
- ముందుగా విద్యార్థులు ఇంటర్ అధికారిక వెబ్‌సైట్ bieap.apcfss.in ఓపెన్ చేయండి
- హోమ్‌పేజీలో ఏపీ ఇంటర్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ 2024 లింక్‌పై క్లిక్ చేయండి.
- విద్యార్థుల లాగిన్ వివరాలు సమర్పించండి.
- ఏపీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్-2024 స్క్రీన్ పై కనిపిస్తుంది.
- మీ హాల్ టికెట్ ను డౌన్‌లోడ్ చేసుకోండి.
ఇంటర్ ఫస్టియర్ పరీక్షల తేదీలు
మార్చి 1 - సెకండ్ లాంగ్వేజ్ పేపర్-I
మార్చి 4- ఇంగ్లీష్ పేపర్ -I
మార్చి 6 -మ్యాథమెటిక్స్ పేపర్-1A, బోటనీ పేపర్ - 1 , సివిక్స్ పేపర్ - 1
మార్చి 9 - మ్యాథమెటిక్స్ పేపర్-1B, జువాలజీ పేపర్ - 1, హిస్టరీ పేపర్ - 1
మార్చి 12- ఫిజిక్స్ పేపర్ - 1, ఎకనామిక్స్ - 1
మార్చి 14 - కెమిస్ట్రీ పేపర్ - I, కామర్స్ పేపర్ - 1, సోషియాలజీ పేపర్ - 1, ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ పేపర్ -1
మార్చి 16 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ - I, లాజిక్ పేపర్ -1 , బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్ - 1
మార్చి 19- మెడ్రన్ లాంగ్వేజ్ పేపర్- I, జాగ్రఫీ పేపర్- 1
ఇంటర్ సెకండియర్ పరీక్షల తేదీలు
మార్చి 2- సెకండ్ లాంగ్వేజ్ పేపర్-II
మార్చి 5 - ఇంగ్లీష్ పేపర్-II
మార్చి 7- మ్యాథమెటిక్స్ పేపర్ పేపర్ - IIA, బోటనీ పేపర్ -II, సివిక్స్ పేపర్- II
మార్చి 11 - మ్యాథమెటిక్స్ పేపర్ - IIB, జువాలజీ పేపర్ పేపర్ -II, హిస్టరీ - II
మార్చి 13 - ఫిజిక్స్ పేపర్- II, ఎకనామిక్స్ - II
మార్చి 15 - కెమిస్ట్రీ పేపర్ - II, కామర్స్ పేపర్ - II, సోషియాలజీ పేపర్- II, ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ పేపర్ -II
మార్చి 18 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ - II, లాజిక్ పేపర్ -II , బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్ - II
మార్చి 20 - మెడ్రన్ లాంగ్వేజ్ పేపర్- II, జాగ్రఫీ పేపర్-II