ఆదిలాబాద్‌లో సమాచార కేంద్రంను ప్రారంభించిన ఆకాష్‌ +బైజూస్‌

AakashBYJU’S launches its First Information Centre in Adilabad. టెస్ట్‌ ప్రిపరేషన్‌ సేవలలో దేశంలోనే అగ్రగామి అయిన ఆకాష్‌+బైజూస్‌, 24 రాష్ట్రాలు,

By Medi Samrat  Published on  8 Jun 2022 11:15 AM GMT
ఆదిలాబాద్‌లో సమాచార కేంద్రంను ప్రారంభించిన ఆకాష్‌ +బైజూస్‌

టెస్ట్‌ ప్రిపరేషన్‌ సేవలలో దేశంలోనే అగ్రగామి అయిన ఆకాష్‌+బైజూస్‌, 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 285కు పైగా కేంద్రాలను కలిగి ఉంది. ప్రతి సంవత్సరం 3.3 లక్షల మంది విద్యార్ధులకు విద్యాబోధన చేస్తుంది. తాజాగా ఆదిలాబాద్‌లో కూడా సమాచార కేంద్రంను ప్రారంభించింది. ఈ కేంద్రం ద్వారా అవసరమైన కోర్సుల సమాచారం అందించడంతో పాటుగా వైద్య, ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు దగ్గరలోని కేంద్ర సమాచారంతో పాటుగా జాతీయ, అంతర్జాతీయ ఒలింపియాడ్స్‌ గురించిన సమాచారమూ అందించనుంది. ఆదిలాబాద్‌లో ధోబీ కాలనీ దాస్నాపూర్‌ లో ఆకాష్‌ +బైజూస్‌ సమాచార కేంద్రంను ప్రారంభించింది.

ఈ సమాచార కేంద్రం వద్ద ఆకాష్‌ +బైజూస్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో పాటుగా అది అందించే కోర్సులు తదితర అంశాలకు సంబంధించిన సమాచారమూ పొందవచ్చు. ఆకాష్‌ +బైజూస్‌ వద్ద విద్యార్థులు వైద్య, ఇంజినీరింగ్‌ కోర్సులతో పాటుగా ఫౌండేషన్‌ స్థాయి కోర్సులను సైతం ఎంచుకోవచ్చు. ఈ నూతన సమాచార కేంద్రాన్ని ఆకాష్‌ +బైజూస్‌ చీఫ్‌ రెవిన్యూ ఆఫీసర్‌ నితిన్‌ గొలానీ ప్రారంభించారు.

ఐఐటీయన్లు, డాక్టర్లుగా మారాలని ఆశిస్తోన్న స్థానిక విద్యార్థులకు ఆదిలాబాద్‌లోని ఈ కేంద్రం ఓ వరంగా మారనుందని ప్రారంభోత్స‌వానికి హాజ‌రైన ప్ర‌ముఖులు అభిప్రాయ‌ప‌డ్డారు. దేశవ్యాప్తంగా నాణ్యమైన బోధన ద్వారా అన్ని ప్రాంతాలకూ చేరువయ్యామని.. ప్రతిష్టాత్మక ఇనిస్టిట్యూట్‌లకు ఎంపికైన తమ విద్యార్థులే ఇందుకు నిదర్శనమన్నారు. ఆకాష్‌ +బైజూస్‌లో చేరాల‌నుకునే విద్యార్థులు ఇన్‌స్టెంట్‌ అడ్మిషన్‌ కమ్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ (ఐఏసీఎస్‌టీ) లేదా ఆకాష్‌ +బైజూస్‌ నేషనల్‌ టాలెంట్‌ హంట్‌ పరీక్షలలో పాల్గొనాలి.













Next Story