ఒంగోలులో భూప్రకంపనలు.. స్థానికుల భయాందోళన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Jun 2020 6:06 AM GMT
ఒంగోలులో భూప్రకంపనలు.. స్థానికుల భయాందోళన

ప్రకాశం జిల్లా ఒంగోలులో పలు చోట్ల శుక్రవారం భూమి స్వల్పంగా కంపించింది. దీంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. ఈ రోజు ఉదయం 10.15 గంటలకు భూమి కంపించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. నగరంలోని శర్మకాలేజీ, అంబేద్కర్‌ భవన్‌, ఎన్జీవక్ష కాలనీ, సుందరయ్య భవన్‌ రోడ్డు తదితర ప్రాంతాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.

ఏపీతో పాటు కర్ణాటక, ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో భూమి కంపించింది. ఝార్ఖండ్‌ రాష్ట్రంలో ఉదయం 6.55 గంటలకు జంషెడ్‌పూర్‌లో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై 4.7 గా దీని తీవ్రత నమోదు కాగా.. కర్ణాటకలోని హంపిలో కూడా ఈ ఉదయం భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌ పై 4గా నమోదైంది. అయితే.. ఈ స్వల్ప భూప్రకంపనలతో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Next Story