అబ్బబ్బబ్బా.. ఇలాంటి ఫ్యామిలీ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్..!

By సుభాష్  Published on  23 Oct 2020 7:30 AM GMT
అబ్బబ్బబ్బా.. ఇలాంటి ఫ్యామిలీ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్..!

ఇటీవల హైదరాబాద్‌లోని దుర్గం చెరువు తీగల వంతెన ప్రారంభమైన విషయం తెలిసిందే. మంచి పర్యటక కేంద్రంగా ఉండటంమతో పర్యాటకుల తాకిడి ఎక్కువైపోయింది. వారంతంలో పెద్ద ఎత్తున నగర వాసులు వస్తుండటంతో వచ్చిపోయే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పర్యాటకుల కోసం ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు సైతం ఇచ్చింది. శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు వాహనాలను నిషేధించిన అధికారులు.. కేవలం పర్యటకులను మాత్రమే అవకాశం కల్పించారు. అయినప్పటికీ వంతెనపై రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. వంతెనపై ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతున్నా.. జనాలు ఇవేమి పట్టించుకోకుండా యధేచ్చగా ఫోటోలు దిగుతున్నారు. దీంతో వచ్చిపోయే వాహనాలతో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. గమనించిన పోలీసులు చర్యలకు దిగారు. వంతెనపై పెద్ద పెద్ద సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. బ్రిడ్జిపై వాహనాలు ఆపితే భారీగా జరిమానాలు విధిస్తున్నారు.

అయితే బైక్‌పై వచ్చిన ఓ ఫ్యామిలి తామేమి తక్కువ కాదన్నట్లుగా అతి తెలివి ప్రదర్శించారు. ఇటీవల పిల్లలతో కలిసి వంతెనపైకి వచ్చిన ఓ కుటుంబం ఫోటోలకు ఫోజులిచ్చారు. వంతెనపై ఫోటోలు దిగడం, వాహనాలు ఆపడం పోలీసులు నిషేధించారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటున్నారు. అయితే బైక్‌పై వచ్చిన ఫ్యామిలి.. సీసీ కెమెరాలను గమనించి భర్త అతి తెలివిని ఉపయోగించాడు. బైక్‌ నెంబర్‌ ప్లేటు కనిపించకుండా భార్య మెడలో ఉన్న చున్నీని తీసి నెంబర్‌ ప్లేట్‌కు కప్పి కవర్‌ చేశాడు. అది కూడా కెమెరాలో రికార్డు అయ్యింది. వీరి అతితెలివి కాస్త పోలీసుల కంట పడటంతో వెంటనే అలర్ట్‌ అయ్యారు.

ఇంకేముంది వారు గమనించి అక్కడి నుంచి పరారయ్యారు. కానీ వారు చేసిన ఐడియా ఏ మాత్రం ఫలించలేదు. జరిమానా నుంచి తప్పించుకోలేదు. వారికి జరిమానా విధించారు. దీనికి సంబంధించిన వీడియోను సైబరాబాద్‌ పోలీసులు అబ్బబ్బబ్బా.. ఇలాంటి ఫ్యామిలీ నెవర్‌ బిఫోర్‌ ఎవర్‌ ఆఫ్టర్‌.. అనే క్యాప్షన్‌తో సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇంకేముంది ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. ఎవరికి వచ్చినట్లుగా వారు కామెంట్‌ పెడుతున్నారు. బిగ్‌బాస్‌ (సీసీకెమెరా) చూస్తున్నాడు.. ఇలాంటి తెలివైన భార్య ఉండటం గ్రేట్‌.. వీరి తెలివి అదిరిపోయింది అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.Next Story