దేశానికి ఎంతో సేవ చేసిన 9 ఏళ్ల ‘డచ్’ కి భారతీయ సేన కన్నీటి వీడ్కోలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Sept 2019 5:52 PM IST
దేశానికి ఎంతో సేవ చేసిన 9 ఏళ్ల ‘డచ్’ కి భారతీయ సేన కన్నీటి వీడ్కోలు

ఢిల్లీ : శనివారం భారతీయ సేన - ఈస్టర్న్ కమాండ్ సభ్యులు తమతో 9 ఏళ్లుగా పని చేస్తున్న ఆప్త మిత్రుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. 9 ఏళ్ల 'డచ్' అనే కుక్క జీవితం అంతా దేశ సేవ కే అంకితం చేసింది. పేలుడు పదార్ధల గుర్తింపులో శిక్షణ పొందిన డచ్ ఎన్నో ఆర్మీ ఆపరేషన్స్ లో పాల్గొంది.

2014లో ప్రధాని మోడీ గువహాటి పర్యటనలో ఉన్నప్పుడు పేలుడు పదర్ధాలను గుర్తించి ఆయన ప్రాణాలు కాపాడినందుకు 'డచ్' ప్రసంశలు అందుకుంది. 7 కిలోల ఐఈడి అనే పేలుడు పదార్ధాన్ని అక్కడ పెట్టినట్టుగా గుర్తించింది. అదే ఏడాది 6 కిలోల ఐఈడి బస్సులో ఉండడన్ని కూడా డచ్ పసిగట్టింది.

Next Story