తాగి.. ఊగి.. తైతక్కలాడిన నలుగురు యువతులు

By సుభాష్  Published on  19 Jan 2020 12:20 PM IST
తాగి.. ఊగి.. తైతక్కలాడిన నలుగురు యువతులు

ముఖ్యాంశాలు

  • పబ్బుల్లో ఫుల్లుగా మద్యం తాగి కారు స్టీరింగ్ పట్టిన యువతులు

  • ట్రాఫిక్‌ పోలీసులతో వాగ్వివాదం

  • నానా హంగామా సృష్టించిన నలుగురు యువతులు

హైదరాబాద్‌లో పురుషులే కాదు .. మహిళలు సైతం ఫుల్లుగా మందు కొట్టి అడ్డంగా దొరికపోతున్నారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని ట్రాఫిక్‌ పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. మందు బాబులకు అడ్డూ.. అదుపు లేకుండా పోతోంది. అర్ధరాత్రి అయిందంటే చాలు ఫుల్లుగా మందుకొట్టి రోడ్లపై హంగామా సృష్టిస్తున్నారు. డ్రంకన్ డ్రైవ్ నిర్వహించే పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసుకు ప్రతిరోజు తలనొప్పిగా మారింది.

పబ్బుల్లో ఫుల్లుగా మందేసి.. చిందేసిన యువతులు కార్ల స్టీరింగ్ పట్టారు. వీకెండ్ లో హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించిన పోలీసులకు నలుగురు యువతులు మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు సహకరించకుండా ట్రాఫిక్ పోలీసులకు చాలాసేపటి వరకు చుక్కలు చూపించారు.

ఓ టీచరమ్మతో పాటు.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జాబ్ చేసే యువతులు పోలీసులకు చిక్కారు. ఎంతకీ కార్లు దిగకుండా ట్రాఫిక్ పోలీసులతో మత్తుగుమ్మలు వాగ్వివాదానికి దిగారు. ట్రాఫిక్ పోలీసులకు సహకరించకుండా నానా హంగామా సృష్టించారు. అతికష్టమ్మీద బ్రీత్ ఎనలైజర్ లో పట్టుబడిన యువతులు సంతకాలు చేయడానికి కూడా మొండికేశారు. రోడ్లపై పరుగందుకున్నారు యువతులు. పోలీసులు వెంబడించి బతిమాలి ఎలాగోలా కేసులు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద, రోడ్డు నెంబర్ 10 వద్ద వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేసి.. 32 కేసులు నమోదు చేశారు.

Next Story