ఆదివారం రాత్రి 9గంటలకు ఇంట్లోని అన్ని లైట్లను బంద్‌ చేసి.. ఇంటి గుమ్మం ముందో, బాల్కానీలోనో నిలబడి 9 నిమిషాలపాటు కొవ్వొత్తి, దీపం, టార్చ్‌ లేదంటే మొబైల్‌ ప్లాష్‌ లైట్‌ రూపంలో వెలుగులు ప్రసరింపజేయండని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తద్వారా మనమంతా ఒక్క తాటిపై పోరాడుతున్నామన్న భావన అందరిలో ఉద్భవిస్తుందని అని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో ఆదివారం రాత్రి 9గంటలకు 9 నిమిషాల పాటు వీధి దీపాలు వెలిగించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు.

Also Read :12 తరువాతే నిర్ణయం తీసుకుంటాం

అయితే ప్రధాని మోదీ సింబాలిజం కోసం ఇచ్చిన పిలుపు మంచిదైనా.. దీని వల్ల పెద్ద ప్రమాదం ఉందని విద్యుత్‌ నిపుణులు అంటున్నారు. మోదీ చెప్పినట్లు చేస్తే పెద్ద ఉపద్రవం వచ్చే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా లైట్లు ఆర్పివేస్తే.. విద్యుత్‌ గ్రిడ్‌లు కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విద్యుత్‌ వినియోగం ఒకేసారి భారీగా పెరిగినా.. ఒకేసారి భారీగా తగ్గినా విద్యుత్‌ గ్రిడ్‌ పని చేయడం నిలిచిపోతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం కొన్ని సూచనలు చేసింది. ఒక్కసారిగా విద్యుత్‌ వినియోగం తగ్గిపోయి గ్రిడ్‌లపై ప్రభావం పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఇంధన శాఖ పేర్కొంది. ఇళ్లలోని లైట్లు మాత్రమే ఆపాలని, ఇతర విద్యుత్‌ పరికరాలు ఆపాల్సిన అవసరం లేదని చెప్పింది. అలాగే వీధి దీపాలు, అత్యవసర ప్రాంతాలు, ఆసుపత్రుల్లో విద్యుద్దీపాలు ఆపొద్దని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.

 

Also Read :ఆ రోజు అందరూ లైట్స్ ఆఫ్ చేస్తే పెను ప్రమాదమేనా.!

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్