12 తరువాతే నిర్ణయం తీసుకుంటాం

By Newsmeter.Network  Published on  4 April 2020 8:14 AM GMT
12 తరువాతే నిర్ణయం తీసుకుంటాం

కరోనా మహమ్మారి దేశంలో రోజురోజుకు విజృంభిస్తుంది. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుంది. వైరస్‌ తీవ్రతను ముందుగానే పసిగట్టిన కేంద్రం.. ఇప్పటికే మార్చి 24 నుంచి ఏప్రిల్‌ 14వరకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించింది. ఎవ్వరూ ఇండ్ల నుంచి బయటకు రావొద్దని, ఎక్కడివారు అక్కడే ఉండాలని కేంద్రం కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బస్సులు, రైళ్లు అన్ని నిలిచిపోయాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. గూడ్స్‌ రైళ్లు మినహా ప్యాసింజర్‌ రైళ్లను నిలిపివేస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం విధించి లాక్‌డౌన్‌ గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో రైల్వే సేవలు తిరిగి ప్రారంభం, టికెట్ల బుకింగ్‌పై రోజుకో వార్త ప్రచారం జరుగుతుంది. దీనిపై రైల్వే శాఖ స్పష్టత ఇచ్చింది.

Also Read :50శాతం కరోనా పాజిటివ్‌ కేసులు ఆ ప్రాంతాల్లొనే..

లాక్‌ డౌన్‌ నేపథ్యంలో 21రోజుల పాటు రైళ్లను నిలిపివేయడం జరిగిందని, తిరిగి 14వ తేదీన ప్యాసింజర్‌ రైళ్లు పున:ప్రారంభించే విషయంపై ఈనెల 12 తర్వాతనే నిర్ణయం ప్రకటిస్తామని రైల్వేశాఖ అధికారులు స్పష్టం చేశారు. రైల్వే టికెట్ల బుకింగ్‌పైనా అధికారులు క్లారిటీ ఇచ్చారు. రైల్వే టకెట్ల బుకింగ్‌ ప్రక్రియ ఎప్పుడూ నిలిచిపోలేదని స్పష్టం చేసింది. రైల్వేశాఖ నిబంధనల ప్రకారం 120 రోజుల ముందే టికెట్ల రిజర్వేషన్‌ చేసుకునే సౌకర్యం ముందు నుంచే ఉందని, కేవలం లాక్‌ డౌన్‌ అమల్లో ఉన్న మార్చి 24 నుంచి ఏప్రిల్‌ 16 తేదీల్లో జరిగే ప్రయాణాలకు మాత్రమే బుకింగ్స్‌ను రద్దు చేయటం జరిగిందని స్పష్టం చేసింది. వేసవి సెలవుల దృష్ట్యా ఇప్పటికే మూడు నెలల ముందు నుంచే బుకింగ్స్‌ చేసుకొనే అవకాశం ఉండటంతో భారీ సంఖ్యలో అడ్వాన్స్‌ రిజర్వేషన్లు జరిగాయి. ఇప్పటికే దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో రిజర్వేషన్లు చేసుకుందామంటే నో రూమ్స్‌ అని వస్తోంది. ఈ నేపథ్యంలో లాక్‌ డౌన్‌పై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే తాము ఒక నిర్ణయం తీసుకుంటామని రైల్వేశాఖ తెలిపింది. ఒకవేళ లాక్‌ డౌన్‌ను ఎత్తివేసి యథావిధిగా రైళ్లు పున:ప్రారంభం అయితే డిమాండ్‌ను బట్టి ప్రత్యేక రైళ్లనుసైతం నడిపేందుకు ఆలోచన చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read :ఏపీలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి

Next Story