ఏపీలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి

By Newsmeter.Network  Published on  4 April 2020 7:18 AM GMT
ఏపీలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్క రోజే 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. శుక్రవారం రాత్రి 10గంటల నుంచి శనివారం ఉదయం 10.30 గంటల వరకు 16 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఏపీ ఆరోగ్యశాఖ తాజా బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 180కి చేరినట్లయింది. కృష్ణా జిల్లాలో కొత్తగా నాలుగు కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో కొత్తగా మూడు, కర్నూల్‌ జిల్లాలో మూడు, కడప జిల్లాలో నాలుగు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Also Read : 50శాతం కరోనా పాజిటివ్‌ కేసులు ఆ ప్రాంతాల్లొనే..

జిల్లాల వారిగా కరోనా పాజిటివ్‌ కేసుల వివరాలు చూస్తే.. అనంతపురం జిల్లాలో రెండు, చిత్తూరు జిల్లాలో 10, తూర్పు గోదావరి జిల్లాలో 11, గుంటూరు జిల్లాలో 23, కడప జిల్లాలో 23, కృష్ణా జిల్లాలో 27, కర్నూల్‌ జిల్లాలో నాలుగు, నెల్లూరు జిల్లాలో 32, ప్రకాశం జిల్లాలో 18, విశాఖపట్టణంలో 15, పశ్చిమ గోదావరి జిల్లాలో 15 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శ్రీకాకులం, విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదు. ఇప్పటి వరకు ఏపీలో ఒక్కరు మృతి చెందారు. ఇదిలా ఉంటే కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో అధికశాతం మంది ఢిల్లిలోని జమాత్‌ వెళ్లిన వారేనని అధికారులు గుర్తించారు.

Next Story
Share it