3 నెలల వరకూ ఇంటి అద్దె అడగకండి.. యజమానులకు ప్రభుత్వం ఆదేశం
By సుభాష్ Published on 18 April 2020 4:34 PM ISTకరోనాతో ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతోంది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంతో సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కనీసం మూడు నెలల పాటు ఇంటి అద్దెను వసూలు చేయవద్దని ఇంటి యజమానులకు ఆదేశాలు జారీ చేసింది. ఇంట్లో అద్దెకు ఇంటున్న వారిని ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించింది. ఒక వేళ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని సూచించినా ఇంటి యజమానులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇబ్బందులకు గురవుతున్న సామాన్య ప్రజలు, కూలీలు, పేదలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది మహారాష్ట్ర సర్కార్.
కాగా, దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది. అందులో మహారాష్ట్రలో కూడా అధికంగా ఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మహారాష్ట్రతో పాటు ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో కరోనా విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి.