భారత్‌లో తొలి కరోనా ఫ్రీ జోన్‌..! ఎక్కడో తెలుసా..?

By సుభాష్  Published on  18 April 2020 7:41 AM GMT
భారత్‌లో తొలి కరోనా ఫ్రీ జోన్‌..! ఎక్కడో తెలుసా..?

కరోనా వైరస్‌ దేశాన్ని కుదిపేస్తోంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా కరోనా మహమ్మారి చాపకింద నీరులా వ్యాపించింది. అయితే ప్రపంచ దేశాలను సైతం కరోనా వణికిస్తుంటే భారత్‌లోని గోవాపై పెద్ద ప్రభావం చూపలేదనే చెప్పాలి. ఎందుకంటే చైనాలో కరోనా వైరస్‌ విజృంభిస్తోందని తెలియగానే గోవా రాష్ట్రం ముందుగానే అప్రమత్తమైంది. ఎంతో అహ్లదకరమైన ప్రాంతం, నిత్యం దేశ విదేశాల నుంచి ఎంతో మంది పర్యాటకుల సందడి భారీగానే ఉంటుంది. అక్కడి టూరిస్ట్‌ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా దర్శనమిస్తుంటుంది. ప్రస్తుత తరుణంలో ప్రపంచ దేశాలు కరోనా బారిన పడుతుంటే గోవాలో మాత్రం గ్రీన్‌ జోన్‌ కనిపిస్తోంది. గత రెండు వారాలుగా చూస్తే అక్కడ కరోనా కేసులు నమోదు కాలేదు.

దేశంలోనే తొలిసారిగా విమానాశ్రయంలో స్క్రీనింగ్‌ పరీక్షలు

Corona Free Zones State

కరోనా మహమ్మారి కారణంగా దేశంలోనే తొలిసారిగా విమానాశ్రయంలో ప్రయాణికులకు స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించింది గోవా. దీంతో కరోనా వైరస్‌ ఉన్న వారు రాష్ట్రంలో ప్రవేశించకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంది.

అన్ని రాష్ట్రాల సరిహద్దులు మూసివేత

ఇక చైనాలో కరోనా కేసులు ఎక్కువ అవుతుండటంతో ముందు జాగ్రత్తలు తీసుకున్న గోవా.. కేంద్రం 'జనతా కర్ఫ్యూ'లో భాగంగా మార్చి 22 నుంచే గోవా అన్ని రాష్ట్రాల సరిహద్దులను సైతం మూసివేసింది. ఇక అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర నుంచి వాహనాలు ఏవి గోవాలో ప్రవేశించకుండా కట్టడి చేసింది. క్రీడా కార్యక్రమాలు, ఇతర పోటీలు, మత సమపరమైన సమావేశాలన్నీ వాయిదా వేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది గోవా ప్రభుత్వం.

Corona free zones state

దీంతో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు కూడా సహకరిస్తున్నారు. అంతేకాదు ఏప్రిల్‌ 3వ తేదీ వరకూ గోవాలో ఏడు కరోనా పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఏడుగురినిలో ఆరుగురు ఇప్పటికే కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు కూడా. ప్రస్తుతం ఒక్కరు మాత్రమే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ ఒక్క బాధితుడు కోలుకుని త్వరలో దేశంలోనే మొదటిసారిగా కరోనా వైరస్‌ ఫ్రీ జోన్‌ కానుందని గోవా అధికారులు చెబుతున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా గోవాను మార్గదర్శకంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Next Story