నోబెల్‌ శాంతి బహుమతి-2021కి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నామినేట్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Sept 2020 5:02 PM IST
నోబెల్‌ శాంతి బహుమతి-2021కి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నామినేట్‌

ప్రతిష్టాత్మక నోబెల్‌ శాంతి బహుతి-2021కి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నామినేట్‌ అయ్యారు. ఇజ్రాయిల్‌, యూఏఈ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చినందుకు నార్వే పార్లమెంటు సభ్యుడు క్రిస్టియన్‌ ట్రైబిడ్రే జెడ్డే ట్రంప్‌ పేరును నామినేట్‌ చేశారు. ప్రపంచవ్యాప్తంగా పలు సమస్యల పరిష్కారానికి ట్రంప్‌ కృషి చేశారని ప్రశంసించారు. కాగా.. ట్రంప్‌కు నోబెల్‌ శాంతి బహుమతి ఇవ్వాలని ఆయనకు మద్దుతగా జెడ్డే మాట్లాడటం ఇదు తొలిసారి కాదు. 2018లోనూ ఆయన పేరును నామినేట్‌ చేశారు. టైబ్రింగ్ జెజెడ్డే నార్వేజియన్ పార్లమెంటులో నాలుగుసార్లు సభ్యుడు. నాటో పార్లమెంటరీ అసెంబ్లీకి నార్వేజియన్ ప్రతినిధిగా పనిచేస్తున్నారు.

నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నవేళ నోబెల్‌ శాంతి పురస్కారానికి ట్రంప్‌ పేరును నామినేట్‌ చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా.. 2009లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నోబెల్ శాంతి బహుమతి లభించింది. అంతర్జాతీయ దౌత్య సంబంధాల బలోపేతానికి, ప్రజల మధ్య సహకారానికి అసాధారణ కృషికి గాను ఆయనకు ఈ విశిష్ట పురస్కారం దక్కింది.

Next Story