నీ బిస్కెట్లు తిన్నాను.. నీకు చీటోస్ తేలేనా బాసూ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 March 2020 2:56 AM GMT
నీ బిస్కెట్లు తిన్నాను.. నీకు చీటోస్ తేలేనా బాసూ..!

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు లాక్ డౌన్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో జనాలు నానా తిప్పలు పడుతున్నారు. ముఖ్యంగా నోటిని చిరుతిళ్లతో మర ఆడించే వారి తిండి కష్టాలు చెప్పక్కర్లేదు.

రోడ్లపైకి వస్తే ఎవరి కరోనా ఎవరికీ అంటుతుందో అన్న భయం ఒకటి అయితే పోలీసులు జులం ఎక్కడ చూపిస్తారో అని ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇతర దేశాల్లో అయితే మనలాగ పోలీసులు బుద్ధి చెప్పరు సరి కదా ఎంచక్కా తీసుకెళ్లి జైల్లో పడేస్తారు.

Dog3

ఈ సందర్భంగానే ఓ మహానుభావుడికి అద్భుతమైన ఐడియా వచ్చింది.మెక్సికోలో ఆంటోనియోఅనే ఓ వ్యక్తి లాక్ డౌన్ కారణంగా తనకు ఇష్టమైన ఫుడ్ ని తినడానికి కుదరడం లేదని తెగ ఫీల్ అయిపోయాడు. మిగతా విషయాల మీద ఇంత బుర్ర పెడతాడో లేదో తెలియదు కానీ, తన ఫేవరెట్ ఫుడ్ సంపాదించుకోవడం కోసం ఒక అద్భుతమైన ప్లాన్ వేశాడు.

తనకు ఇష్టమైన ‘చీతూస్‘ ను తెచ్చుకోవడానికి తన పెంపుడు జంతువు కుక్కను ఉపయోగించుకున్నాడు. తన బుల్లి పెంపుడు కుక్క మెడకు చిట్టీ చుట్టాడు. హలో, షాప్‌కీపర్. నా కుక్కకు చీతోస్ ఇవ్వు. ఎర్రది కాదు, ఆరెంజ్ రంగుది. దాని కాలర్‌కు 20 డాలర్లు ఉన్నాయి, తీసుకో అని రాశాడు.

అలానే దారి మధ్యలో ఎవరైనా కుక్కను చూసి ఆరా తీసి డబ్బులు కాజేస్తారనే అనుమానంతో వారందరికీ కూడా ఒక హెచ్చరిక కూడా రాశాడు. కుక్కను గనుక కదిపితే ఇక అంతే అది కరుస్తుంది అంటూ మరో చీటీ కూడా రాశాడు. ఇక ఆ కుక్క యజమాని ఆర్డర్స్ ను ఫాలో అవుతూ షాపుకు వెళ్లి, యజమాని కోరిన చీతూస్ పొట్లం పట్టుకొచ్చేసింది.

అది షాపుకు వెళ్తున్న, తిండిని తిరిగి ఇంటికి తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోస్ చూడండి.. మా బాస్ కోసం నేనేమన్నా చేస్తా అన్నట్టుగా లేదు.. ఆ బుజ్జి కుక్క ఎక్స్ప్రెషన్.. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు కూడా ఐడియా బాగానే ఉందంటున్నారు.

Next Story