లారెన్స్ తమ్ముడు నన్ను వేధిస్తున్నాడు.. మితిమీరడంతోనే..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 March 2020 2:40 PM IST
ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ తమ్ముడు ఎల్విన్ తనను గత కొన్ని రోజులుగా వేధిస్తున్నాడని దివ్య అనే జూనియర్ ఆర్టిస్ట్.. బషీర్‌బాగ్‌లోని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. దివ్య స్వస్థలం వరంగల్. లారెన్స్ సోదరుడు ఎల్విన్ ప్రేమను.. తాను తిరస్కరించడంతోనే వేధించడం మొదలు పెట్టాడని దివ్య పేర్కోంది.
ఈ విషయమై మీడియాతో మాట్లాడిన దివ్య.. చాలా రోజులు ఓపిక పట్టానని.. ఎల్విన్ వేధింపులు మితిమీరిపోవడంతో తట్టుకోలేక హైదరాబాద్ వెస్ట్ మారేడ్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది. అయితే అక్కడి పోలీసు అధికారులతో కుమ్మక్కై వాళ్లు.. రివర్స్‌గా తనపైనే తప్పుడు కేసులు పెట్టారని తెలిపింది.
పోలీస్ అధికారి.. లారెన్స్ ఎలా చెబితే అలా.. ఆయనకు నమ్మిన బంటులా మారిపోయారని ఆరోపణలు చేసింది. ఆ పోలీసు అధికారి అండతో తనను జైలుకు కూడా పంపించారని దివ్య ఆరోపించింది. కొన్ని రోజులుగా తనను.. కొందరు ఫాలో అవుతున్నారని, లారెన్స్ తమ్ముడితో ప్రాణ భయం ఉందని.. అతడి నుండి తనను కాపాడాల్సిందిగా సీఎం కేసీఆర్‌ను వేడుకుంటున్నానని పేర్కోంది.
ఇదిలావుంటే.. లారెన్స్ ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. లక్ష్మి బాంబ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.