తెలంగాణలో రేషన్‌ పంపిణీ ప్రారంభమైంది. కరోనా వైరస్‌ ప్రభావంతో రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ కొనసాగుతుంది. ఎవరి ఇండ్లకు వాళ్లే పరిమితమవుతున్నారు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు పనులు లేక పస్తులుండాల్సిన పరిస్థితి వస్తోంది. దీంతో రేషన్‌ పంపిణీతో పాటు నిత్యవసర సరుకులు కొనుక్కొనేందుకు ప్రతీ రేషన్‌ కార్డు దారుడికి రూ. 1500 చొప్పున ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత రేషన్‌ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. తెల్ల రేషన్‌ కార్డు ఉన్న పేదలకు రేషన్‌ సరుకులు అందించే పనిలో నిమగ్నమైంది. పౌరసరఫరాల అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నుంచి బియ్యాన్ని రేషన్‌ దుకాణాల ద్వారా పంపిణీ చేయనున్నారు.

Also Read :మర్కజ్‌ పార్థనల్లో తెలంగాణ నుంచి 380 మంది.. అప్రమత్తమైన ప్రభుత్వం

రాష్ట్రంలో 1.09 కోట్ల కుటుంబాలు ఉండగా 87.59 లక్షల కుటుంబాలకు తెల్ల రేషన్‌ కార్డుదారులు ఉన్నారు. వీరికి ఒక్కో లబ్ధిదారుడికి 12 కేజీల బియ్యం చొప్పున పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే రేషన్‌ పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 3.36లక్షల టన్నుల బియ్యాన్ని అందుబాటులో ఉంచారు. ఈ రేషన్‌ బియ్యం పంపిణీ ద్వారా రాష్ట్ర ఖజానాపై రూ.1.103 కోట్ల ఆర్థిక భారం పడుతోంది. ఇదిలా ఉంటే రేషన్‌ దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించి రేషన్‌ తీసుకొనేలా ఏర్పాట్లు చేశారు. రేషన్‌ షాపుల ముందు మీటర్‌ దూరంలో రౌండ్‌లు ఏర్పాటు చేయడం ద్వారా రేషన్‌కోసం వచ్చేవారు సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు.

Also Read :ఏప్రిల్‌ 7 నాటికి కరోనా ఫ్రీ తెలంగాణ సాధ్యమేనా? కేసీఆర్‌ వ్యాఖ్యలు నిజమెలా అవుతాయి?

మరోవైపు తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభిస్తుంది. ఇప్పటికే 76 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ఆరుగురు మృతి చెందారు. తాజాగా ఢిల్లిలో జరిగిన మతపార్థనల్లో పాల్గొన్న వారికి వైరస్‌ సోకడం. తెలంగాణ నుంచి అధికారిక లెక్కల ప్రకారం 380 మంది పాల్గొనడం, వీరిలో అన్ని జిల్లాలకు చెందిన వారు ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే మతపరమైన పార్థనల్లో పాల్గొన్న వారిని గుర్తించి ఆస్పత్రులకు తరలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయిన ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్