ఎన్‌కౌంటర్‌పై 'సుప్రీం' విచారణకు నిరాకరణ..!
By Newsmeter.Network Published on 17 Dec 2019 2:14 PM IST
ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే పిటిషన్ విచారించేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కమిషన్ వేశామని ధర్మాసనం వ్యాఖ్యనించింది. కాగా తెలంగాణ హైకోర్టు వెళ్లేందుకు అనుమతి కావాలని పిటిషన్‌ర్ కోర్టును కోరారు. హైకోర్టు వెళ్లేందుకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు సేకరించి భద్రపరచాలని పిటిషన్ కోరారు. పిటిషనర్ వాదనలు విన్న సుప్రీంకోర్టు ఆధారల సేకరణపై తెలంగాణ హైకోర్టు సరైన ఆదేశాలు ఇస్తుందని పేర్కొంది. సుప్రీంకోర్టులో దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సామాజిక కార్యకర్త సజయ సహా పలువురు పిటిషన్ వేశారు.
సుప్రీంకోర్టు ఎన్‌కౌంటర్‌పై వీఎస్ సిర్‌పుర్కార్ అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జస్టిస్ వీఎస్ సిర్‌పుర్కార్, బాంబే హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ రేఖ, రిటైర్డ్ సీబీఐ డైరెక్టర్ కార్తికేయన్‌ను నియమించిన సుప్రీంకోర్టు నియమించింది. కమిషన్‌కు సీఆర్ఫీఎఫ్ భద్రత కల్పిస్తుందని.. కమిషన్ ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని సుప్రీంకోర్టు తెలిపింవది. కమిషన్ విచారణపై మీడియా కవరేజ్ ఉండకూడదని పేర్కొంది. ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని త్రిసభ్య కమిషన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.
మరోవైపు దిశ నిందితుల మృతదేహాలు ఇంకా గాంధీ ఆస్పత్రిలోనే ఉన్నాయి. ఎన్‌కౌంటర్ జరిగి ఇవాళ్టికి 12 రోజులు దాటింది. మృతదేహాలు చెడిపోకుండా ఖరీదైన ఇంజెక్షన్లు ఇచ్చి భద్రపరిచారు. కాగా నిందితులు మృతదేహాలు క్రమక్రమంగా కుళ్లిపోతున్నాయని గాంధీ ఆస్పత్రికి వైద్యులు తెలిపారు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న కారణంగా మృతదేహాలను అంత్యక్రియలు నిర్వహించేందుకు అనుమతి లభించలేదు. సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిషన్ త్వరలోనే నిందితులను మృతదేహాలను పరిశీలించనుంది. కాగా మరోసారి మృతదేహాలకు ఎంబాల్మింగ్ చేస్తే రీపోస్టుమార్టంకు అవకాశం ఉండదని వైద్యులు పేర్కొంటున్నారు. మృతదేహాలను ఢిల్లీలోని అత్యాధునిక మార్చురీకి తరలించాలని తెలంగాణ పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.