కరోనాపై పార్వతీపురం పోలీసుల డ్యాన్స్‌ వైరల్..

By అంజి  Published on  22 March 2020 4:12 AM GMT
కరోనాపై పార్వతీపురం పోలీసుల డ్యాన్స్‌ వైరల్..

కరోనా వైరస్‌ ఇప్పుడు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇంతలా జరుగుతుంటే సినిమా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఊరుకుంటాడా చెప్పండి. వివాదాల దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ఎప్పుడు ఎలాంటి వివాదాలు సృష్టిస్తాడో ఎవ్వరికి తెలియదు. ఆర్జీవీ ఎప్పుడు ఎవరినీ ఏ రకంగా టార్గెట్‌ చేస్తాడో ఎవరికి తెలియదు. తనకు నచ్చిన వాళ్లపై వర్మ ఏదో కామెంట్స్‌ చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కేసులు ఐదు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ప్రభుత్వంతో పాటు పోలీసులు అవగహన కల్పిస్తున్నాయి. అయితే కరోనాపై ప్రజలకు అవగహన కల్పించాలని డిఫరెంట్‌గా చేశారు. ఇటీవల బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అయిన అల వైకుంఠపురం సినిమాలోని రాములో రాములా పాటకు డ్యాన్స్‌ చేస్తూ చేతులు శుభ్రంగా కడుక్కోండి అంటూ ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. అయితే ఆ వీడియో మన ఆర్జీవీ కంట పడింది. ఇక ఊరుకుంటాడా.. పార్వతీపురం పోలీసులను టార్గెట్‌ చేస్తూ ట్విటర్‌లో పోస్టు పెట్టాడు.

Also Read: క‌రోనాపై పోరు: క‌ర్ఫ్యూలో 63వేల మంది పోలీసులు.. 11వేల హోంగార్డులు

సమాజంలో పోలీసులు ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. ప్రజలకు దిశా నిర్దేశం ఒక పద్దతిలో చేయాలి.. కానీ సంపూర్ణేష్‌ బాబులా కామెడీ చేయకూడదు అంటూ రామ్‌గోపాల్‌ వర్మ పోస్టు చేశాడు. ఇక ఈ పోస్టులో పార్వతీపురం పోలీసుల డ్యాన్స్‌ వీడియో బాగా వైరల్‌ అవుతోంది.

కరచాలనం వద్దు.. నమస్కారమె ముద్దు అంటూ పార్వతీపురం పోలీసులు రాములో రాములా సాంగ్‌కు డ్యాన్స్‌ చేశారు.



Next Story