కరోనాపై స్పందించిన జక్కన్న
By రాణి Published on 16 March 2020 1:14 PM ISTప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారి..భారత్ లో కూడా రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. ఇప్పటి వరకూ ఈ వైరస్ తో ఇద్దరు మృతి చెందగా..బాధితుల సంఖ్య 100కు చేరింది. పలురాష్ర్టాలు ఇప్పటికే కరోనాను కట్టడి చేసే దిశగా చర్యలు ప్రారంభించాయి. స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు, మాల్స్..ఇతరత్రా వ్యాపార సంస్థలను మూసివేయాల్సిందిగా ఆదేశాలిచ్చిన నేపథ్యంలో..సోమవారం నుంచి ఈ ఆదేశాలు అమలయ్యాయి. సినిమా షూటింగ్ లపై కూడా కరోనా ప్రభావం పడింది. కరోనా వైరస్ అదుపులోకి వచ్చేంతవరకూ ఎలాంటి సినిమా షూటింగ్స్ చేయరాదని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో సినీ పరిశ్రమ స్తంభించిపోయింది. దీనిపై దర్శకుడు రాజమౌళి ట్విట్టర్ ద్వారా స్పందించారు.
Also Read : ఆడియన్స్ లేకుండానే అవార్డులిచ్చేశారు
కరోనా వైరస్ ధాటికి యావత్ ప్రపంచంలోని జనజీవనం ఇలా స్తంభించిపోవడం చూస్తుంటే చాలా షాకింగ్ గా ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు భయాందోళనలు చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు ప్రామాణిక సూత్రాలను పాటించాలని సూచించారు రాజమౌళి. కరోనాపై కాస్త అప్రమత్తంగా ఉండండి అని రాజమౌళి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Also Read : నితిన్ డెస్టినేషన్ వెడ్డింగ్ కు బ్రేకులు..ఎందుకంటే