టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరైన హీరో నితిన్ త్వరలోనే ఓ ఇంటివాడవ్వబోతున్న సంగతి విధితమే. తాను ప్రేమించిన షాలినితో నితిన్ ఇంట్లో పెద్దల ఒప్పందంతో ఫిబ్రవరిలో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. ఏప్రిల్ లో దుబాయ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్.. ఆ తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ కు ప్లాన్ చేసుకున్నాడు. కానీ..ఇండియాలోకి..అందులోనూ తెలుగు రాష్ర్టాలలోకి చొరబడిన కరోనా వైరస్ నితిన్ ఆశలపై నీళ్లు చల్లింది.

Also Read : యాభై ఏళ్ల తర్వాత గాళ్ ఫ్రెండ్ ను కలిసిన అమితాబ్..

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఆయా దేశాల ప్రధానులు, మంత్రులు, అధికారులంతా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. దుబాయ్ లో కూడా ఎక్కువమంది పాల్గొనే ఫంక్షన్లు నిర్వహించరాదన్న నియమం రానుంది. ఈ నేపథ్యంలో నితిన్ డెస్టినేషన్ వెడ్డింగ్ కు బ్రేకులు పడ్డాయి. అలాగే విదేశాల్లో వివాహం అంటే..కరోనా వైరస్ సోకే అవకాశం ఉండటంతో హైదరాబాద్ లోనే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడట నితిన్.

Also Read : ఇంత ఆల్కహాల్ నేనెప్పుడూ తీసుకోలేదు : కాజల్

ఇక నితిన్ పెళ్లి రోజునే హీరో నిఖిల్ కూడా తన ప్రేయసిని వివాహం చేసుకోనున్నారు. మరి ఈ కుర్ర హీరో తన వివాహాన్ని విదేశాల్లో జరుపుకుంటాడో లేక..ఇండియాలోనే చేసుకుంటాడో అన్నదానిపై ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. ఏదేమైనా..కరోనా వైరస్ మాత్రం అందరినీ భయపెట్టేస్తోంది. పెళ్లిళ్లు చేసుకోవాలన్నా, ఎక్కడైనా భోజనాలు చేయాలన్నా, ఎవరిని కలవాలన్నా కూడా ఆలోచింపజేస్తోందీ మహమ్మారి.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.