కరోనా వైరస్ రోజురోజుకూ భారత్ లో కూడా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తొలిసారి జీ సినీ అవార్డుల ప్రధానోత్సవం ప్రేక్షకులు లేకుండానే జరిగిపోయింది. ఎంత ఘనంగా ఫంక్షన్ నిర్వహించినప్పటికీ..ప్రేక్షకులు లేకుండా అవార్డులు తీసుకోవడమంటే..నటులకు కూడా అదొలా ఉంటుంది కదా. ముంబయిలో నిర్వహించిన 2020 జీ సినీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హృతిక్ రోషన్, రణ్ వీర్ సింగ్, సారా అలీ ఖాన్, తాప్సి, రకుల్ ప్రీత్ సింగ్, రాజ్ కుమార్ రావ్, అనన్యా పాండే, కార్తిక్ ఆర్యన్, అపర్ శక్తి ఖురానా, గోవింద తదితరులు సందడి చేశారు. రాజ్ కుమార్, అపర్ శక్తి, కార్తీక్ లు ఈ కార్యక్రమానికి యాంకర్లుగా చేయగా..హృతిక్, రణ్ వీర్, సారా తదితరులు డ్యాన్స్ చేసి..కార్యక్రమానికి వచ్చిన అతిథుల్లో ఉత్సాహాన్ని నింపారు.

Also Read : కరోనాను అరికట్టేందుకు..టీటీడీ సంచలన నిర్ణయం

ఈ అవార్డుల కార్యక్రమంలో రణ్ వీర్ సింగ్ మూడు అవార్డులు గెలుచుకున్నారు. గల్లీబాయ్ లో ఉత్తమనటుడిగా, సాంగ్ ఆఫ్ ది ఇయర్, వెండితెర ఉత్తమ జోడీ (రణ్ వీర్, అలియా భట్) విభాగాల్లో మూడు అవార్డులను సొంతం చేసుకున్నట్లు రణ్ వీర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా అతని భార్య దీపికా పదుకొనే నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉంటావు అంటూ..కామెంట్ చేశారు. అలాగే గల్లీబాయ్ సినిమాలో ద్వారా తొలిసారి బాలీవుడ్ కు పరిచయమైన సిద్ధార్థ్ చతుర్వేది కూడా రెండు అవార్డులందుకున్నారు.

Also Read : ముసుగు దొంగ హల్‌చల్‌.. వణుకుతున్న మంచిర్యాల ప్రజలు

బద్లా సినిమాలో తాప్సీ నటకుగాను..ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకుంది. అలాగే పతి పత్ని ఔర్ ఓ సినిమాలో నటించిన కార్తీక్ ఆర్యన్ కూడా ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ..అవార్డుల వేడుకలో పాల్గొనేందుకు టికెట్లు తీసుకున్నవారికి త్వరలోనే వారి డబ్బులను రీఫండ్ చేస్తామని తెలిపారు. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది ఇలా చేయాల్సి వచ్చిందని క్షమాపణలు చెప్పారు. అలాగే ఈ నెల 28వ తేదీన ఈ కార్యక్రమాన్ని టీవీలో వీక్షించవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort