కరోనాను అరికట్టేందుకు..టీటీడీ సంచలన నిర్ణయం

By రాణి  Published on  14 March 2020 1:03 PM GMT
కరోనాను అరికట్టేందుకు..టీటీడీ సంచలన నిర్ణయం

దేశ వ్యాప్తంగా కేంద్రం కరోనా టెర్రర్ పై హై అలర్ట్ ప్రకటించడంతో..ఇప్పటికే తెలంగాణ కర్ణాటక ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ రెండు రాష్ర్టాల్లోనూ స్కూళ్లు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ ఈ నెల 31వ తేదీ వరకూ మూసివేయాల్సిందిగా ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. అలాగే హిమాచల్ ప్రదేశ్, గోవా, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాల్లో కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించాయి ప్రభుత్వాలు. అలాగే ఈ నెలాఖరు వరకూ థియేటర్లన్నీ మూగబోనున్నాయి. రాజస్థాన్ లో విద్యాసంస్థలు, థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్ మూతపడ్డాయి. బెంగళూరులో వారంరోజులపాటు మాల్స్, థియేటర్లు మూతపడనున్నాయి.

Also Read : జుట్టు రాలే సమస్యకు చెక్..ఈ 10 చిట్కాలు మీ కోసమే

తాజాగా..టీటీడీ కూడా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తిని నివారించడంలో భాగంగా..భక్తులు క్యూ కాంప్లెక్స్ లలో వేచి ఉండే పద్ధతికి టీటీడీ తాత్కాలికంగా స్వస్తి పలికింది. టైమ్ స్లాట్ ద్వారా మాత్రమే టోకెన్లు కేటాయించి భక్తులను దర్శనానికి పంపాలని టీటీడీ నిర్ణయించింది. కంపార్ట్‌మెంట్లులో వేచి ఉంటే కరోనా వ్యాప్తి చెందే అవకాశముండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే కడప జిల్లాలోని ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణాన్ని కూడా టీటీడీ రద్దు చేసింది.

Advertisement

Also Read : ప్రేమించాడు..పెళ్లి చేసుకుంటానన్నాడు..దొరికింది ఛాన్స్

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణ భూమిపూజను వాయిదా వేసింది. అలాగే కరోనా నివారణను కోరుతూ.. శ్రీశ్రీనివాస శాంతి ఉత్సవ సహిత ధన్వంతరి మహాయాగంను నిర్వహించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. మరోవైపు విశేషపూజ, సహస్త్ర దీపాలంకరణ సేవ, వసంతోత్సవం సేవలను ముందుగా బుక్ చేసుకున్న భక్తులకు తేది మార్చుకునే అవకాశం, లేదా బ్రేక్ దర్శనంకు వెళ్లే వెసులుబాటును టీటీడీ కల్పించింది. కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది ఒకేచోట గుమికూడటం మంచిదికాదని భావించిన టీటీడీ ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది.

Also Read : కరోనా ఎఫెక్ట్ : కీలక నిర్ణయం తీసుకున్న రాజ్ భవన్

Next Story
Share it